Breaking News

సారొచ్చారు.. ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా బాధ్యతలు

Published on Wed, 12/11/2024 - 19:12

బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 26వ గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు గవర్నర్‌గా పనిచేసిన శక్తికాంతదాస్‌ మంగళవారం పదవీ విరమణ చేశారు. సంజయ్‌ మల్హోత్రా పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త ఆర్‌బీఐ గవర్నర్‌ మాట్లాడారు.

‘ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, విశ్వాసం, వృద్ధి మూడు మూల స్థంభాల్లాంటివి. వీటిని కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. అందుకు భారత సెంట్రల్ బ్యాంక్ నిరంతరం కృషి చేస్తోంది. కొన్నేళ్లుగా ఆర్‌బీఐ పనితీరు, అనుసరిస్తున్న విధానాలు ప్రశంసణీయం. ఇందుకోసం చాలామంది సిబ్బంది శ్రద్ధతో పని చేశారు. వారు కాపాడుతూ వచ్చిన ఆర్‌బీఐ ప్రతిష్టను నేను మరింత ముందుకు తీసుకెళ్తాను. 2047 వరకు ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. దాన్ని సాధించేందుకు సమర్థమంత నిర్ణయాలు అవసరం. ఈ సంస్థ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తుంది’ అని సంజయ్‌ మల్హోత్రా చెప్పారు.

అపార అనుభవం..

56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్‌ పాలసీలో మాస్టర్స్‌ పట్టా పొందారు. 1990 బ్యాచ్‌ రాజస్తాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్‌లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఇదీ చదవండి: కంటెంట్‌ ఖండాలు దాటేలా యూట్యూబ్‌ కొత్త ఫీచర్‌

నిన్నటి వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది.  ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషించారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)