Breaking News

ఆధార్‌ ఓటీపీ మీ మొబైల్‌ నంబర్‌కే వస్తోందా?

Published on Wed, 05/03/2023 - 14:48

ఆధార్ కార్డులకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. కార్డుదారులు ఇప్పుడు తమ ఆధార్‌తో సీడ్ చేసిన మొబైల్ నంబర్‌లు, ఈమెయిల్ ఐడీలను ధ్రువీకరించవచ్చు. దీంతో తమ ఆధార్ OTP వేరే మొబైల్‌ నంబర్‌కు వెళ్తుందన్న ఆందోళన ఇక అక్కర్లేదు!

ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్‌14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! 

కార్డుదారులు తమ ఆధార్‌కు సీడ్ చేసిన మొబైల్ నంబర్ల గురించి కొన్ని సందర్భాల్లో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీనివల్ల OTP వేరే మొబైల్ నంబర్‌కు వెళుతోందేమోనని ఆందోళన చెందుతుంటారు. ఈ ఇబ్బందులను గుర్తించిన యూఐడీఏఐ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఆధార్ కార్డ్ హోల్డర్లు సీడెడ్ నంబర్లు, ఈమెయిల్‌ ఐడీలను సులభంగా చెక్‌ చేసుకోవచ్చని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ఆధారంగా ఐఎఎన్ఎస్ ఈ మేరకు నివేదించింది. 

ఇలా వెరిఫై చేయండి
కార్డుదారులు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ (https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ ద్వారా ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. వెబ్‌సైట్ లేదా యాప్‌ లోకి వెళ్లిన తర్వాత 'వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్' ట్యాబ్‌ను క్లిక్‌ చేసి తమ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌లను ధ్రువీకరించవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలో మార్పులు ఉంటే దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు.

ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్‌ వసూళ్ల రికార్డు 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)