Breaking News

కొత్త పన్ను కోడ్‌ అవసరం

Published on Sun, 12/01/2024 - 04:25

న్యూఢిల్లీ: వికసిత్‌ భారత్‌ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్య సాధనకు తక్కువ పన్ను రేట్లతో కూడిన సమగ్రమైన పన్నుల కోడ్‌ను తీసుకురావాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడం, వసూళ్లు మెరుగుపరుచుకోవడం, నిబంధనల అమలును ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఇందుకు ‘ఎఫ్‌ఎల్‌ఏటీ’ నమూనాను ప్రస్తావిస్తున్నారు. 

కేవలం కొన్ని శ్లాబులు, తక్కువ రేట్లతో, వివాదాలను తగ్గించే విధంగా, పన్ను చెల్లింపుదారులను విస్తృతం చేసే విధంగా ఉండాలంటున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న నేపథ్యంలో నిపుణుల సూచనలకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘జీఎస్‌టీ కింద ఎన్నో రకాల రేట్లు ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు.

 జీఎస్‌టీ అన్నది ఒక్కటే రేటుగా ఉండాలి. కానీ, మన దేశంలో ఒకటే రేటు అన్నది సాధ్యం కాదు’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) మాజీ చైర్మన్‌ పీసీ ఝా అభిప్రాయపడ్డారు. కాకపోతే 5 శాతం, 16 శాతం, 28 శాతం చొప్పున మూడు పన్ను శ్లాబులను పరిశీలించాలని సూచించారు. 

థింక్‌ చేంజ్‌ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ అంశంపై మాట్లాడారు. ప్రస్తుత పన్ను వ్యవస్థలోని నిబంధనలను సులభతరం చేయాల్సిన అవసరాన్ని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ పార్ట్‌నర్‌ రాజీవ్‌ ఛుగ్‌ సైతం సమరి్థంచారు. ‘‘పన్ను రేట్లు తగ్గించడం వల్ల పౌరులు, కంపెనీలకు ఖర్చు పెట్టేందుకు వీలుగా నిధుల మిగులు పెరుగుతుంది. రేట్లను క్రమబద్దీకరిస్తే అది ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుంది’’అని ఛుగ్‌ వివరించారు. 

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)