Breaking News

సిగరెట్లపై భారీ ట్యాక్స్‌.. వచ్చే 1 నుంచే..

Published on Sat, 01/03/2026 - 17:57

దేశంలో పొగరాయుళ్లకు ఖర్చు మరింత పెరగనుంది. పొగాకు ఉత్పత్తులు (సిగరెట్లు), పాన్‌ మసాలాపై జీఎస్టీ, పరిహారం సెస్, ఆరోగ్య సుంకాలు పెంచనున్నట్లు ఇదివరకే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఫిబ్రవరి 1 నుంచి వాటిని  అమలు చేయనున్నట్లు నోటిఫై చేసింది.

ప్రస్తుతం సిగరెట్లపై 28 శాతం జీఎస్టీ, వివిధ రేట్లతో పరిహార సెస్ వసూలు చేస్తున్నారు. 2017 జూలైలో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి సిగరెట్లపై పన్నులు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ, అంతకు మించి ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, ఎక్సైజ్ సుంకం అమలుకానున్నాయి. ఇక బీడీల విషయానికి వస్తే 18 శాతం జీఎస్టీ అమల్లోకి వస్తుంది.

పొగాకు ఉత్పత్తుల కోసం కొత్త ఎంఆర్‌పీ ఆధారిత వాల్యుయేషన్ మెకానిజంను ప్రవేశపెట్టారు. అంటే ఉత్పత్తి ప్యాకేజీపై పేర్కొన్న రిటైల్ అమ్మకపు ధర ఆధారంగా జీఎస్టీని నిర్ణయిస్తారు. ఇక గుట్కాపై 91 శాతం, నమిలే పొగాకుపై 82 శాతం, జార్దా ఘాటు పొగాకుపై 82 శాతం అదనపు ఎక్సైజ్ సుంకం విధించనున్నారు.

సిగరెట్లపై జీఎస్టీ, సుంకాలు ఇలా..
ఇప్పటి వరకు, సిగరెట్లపై ప్రధానంగా జీఎస్టీ, విలువ ఆధారిత లెవీ ద్వారా పన్ను విధించేవాళ్లు. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై ఈ కింది ప్రమాణాలను బట్టి 1,000 సిగరెట్లరకు రూ .2,050 నుండి రూ .8,500 వరకు పన్ను విధించనున్నారు.

  • 65 మిల్లీమీటర్ల వరకు పొడవున్న నాన్‌ ఫిల్టర్ సిగరెట్ల ధర సుమారు రూ .2.05 పెరుగుదలను చూస్తుంది.

  • 65 మిమీ వరకు ఉండే ఫిల్టర్ సిగరెట్ల ధర సుమారు రూ.2.10 పెరుగుతుంది.

  • మీడియం పొడవు (65 నుంచి 70 మిల్లీమీటర్లు) సిగరెట్ల ధర రూ.3.6 నుంచి రూ.4 వరకు పెరుగుతుంది.

  • 70 నుండి 75 మిమీ పొడవు ఉన్న పొడవైన,  ప్రీమియం సిగరెట్ల ధర సుమారు రూ .5.4 పెరుగుదలను చూస్తుంది.

#

Tags : 1

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)