Breaking News

స్పోర్టియస్ట్ డిజైన్‌తో హ్యుందాయ్​ సొనాటా సరికొత్తగా

Published on Mon, 03/27/2023 - 13:19

సాక్షి,ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్​ మోటార్స్​ సరికొత్త హ్యుందాయ్ సొనాటాకారును  ఆవిష్కరించింది. లాంచ్‌ చేసింది. మిడ్‌ సెగ్మెంట్‌లో ​ 8వ జెనరేషన్ సొనాటాను కొత్త బ్యాడ్జ్‌, లాంగ్‌ హుడ్, ఫ్రంట్-ఎండ్ లేఅవుట్‌తో స్పోర్టియస్ట్ డిజైన్‌తో పరిచయం చేసింది.  స్పోర్ట్,  స్టాండర్డ్ ,  N లైన్ వేరియంట్లలో  మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది.

హ్యుందాయ్​ సొనాటా 
వెర్నా, కోనా ఎలక్ట్రిక్​, స్టారియా పోలిన స్టయిల్‌తోపాటు, డ్రైవర్-సెంట్రిక్ ఇంటీరియర్ లేఅవుట్‌తో ఆల్​ న్యూ  హ్యుందాయ్​సొనాటా రానుంది. ముఖ్యంగా హ్యుందాయ్ మోడల్‌లో తొలిసారిగా సొనాటా డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్‌లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కర్వ్డ్‌ డిస్‌ప్లేను జోడించింది.  సిగ్నేచర్​ ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ లైట్​ బార్​, రియర్‌ ఎల్​ఈడీ టెయిల్​లైట్​ స్ట్రిప్​, బ్లాక్​ బార్​, మధ్యలో హ్యుందాయ్​ లోగో, డిఫరెంట్‌ గ్రిల్‌తో​  దీన్ని అప్‌డేట్‌ చేసింది.  

అలాగే స్పోర్టియర్ ఎక్స్‌టీరియర్ ఇమేజ్‌తో ఆధునిక జీవనశైలికి మద్దతుగా భవిష్యత్ మొబిలిటీ సెన్సిబిలిటీతో దీన్ని తీర్చిదిద్దింది. 12.3 ఇంచ్​ ట్విన్​ టచ్‌  స్క్రీన్​ డిస్‌ప్లే, ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ ఫుల్లీ ఎక్స్​టెండెడ్​ ఎయిర్​ వెంట్స్​, న్యూ సెంట్రల్​ క్లైమేట్​ కంట్రోల్​ ప్యానెల్​, న్యూ 3 స్పోక్​ స్టీరింగ్​ వీల్​ మార్పులు  కూడా చేసింది.

ఇంజీన్‌
1.6 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​, 2.5 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​, 2.5 లీటర్​ టర్బో ఇంజిన్​ ఆప్షన్స్​ తో ఇది రానుంది. అలాగే ఎన్‌ లైన్‌లో మరొకటి వస్తోంది. ఈ ఇంజీన్‌ 285హెచ్‌పీ పవర్‌, 422 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది. మార్చి 30నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనున్న 2023 సియోల్ మొబిలిటీ షోలో దీన్ని  ఆవిష్కరించనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)