మారిన రూల్స్: ఈ రోజు నుంచే అమల్లోకి..

Published on Fri, 11/01/2024 - 08:45

ఈ రోజు (నవంబర్ 1) నుంచి డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్, అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్, సిలిండర్ ధరలలో మార్పు మొదలైనవి వాటిలో కీలకమైన మార్పులను జరగనున్నాయి. ఈ మార్పులు భారతదేశంలోని పౌరుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

ఎల్‌పీజీ సిలిండర్ ధరలు
ప్రతి నెల మాదిరిగానే.. పెట్రోలియం కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను సవరిస్తాయి. కమర్షియల్ సిలిండర్‌లపై ఆధారపడే వ్యాపారులు ఈ హెచ్చుతగ్గులను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి సిలిండర్ ధరలలో మార్పు జరుగుతుంది.

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ అప్‌డేట్స్
యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలకు సంబంధించి కీలకమైన మార్పులు ఈ రోజు నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఇన్ సెక్యూర్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై ఫైనాన్స్ ఛార్జి నెలకు 3.75 శాతం పెరుగుతుంది. అంతే కాకుండా బిల్లింగ్ వ్యవధిలో యుటిలిటీ చెల్లింపులు మొత్తం రూ. 50వేలు కంటే ఎక్కువ ఉంటే.. 1 శాతం ఛార్జి విధిస్తారు. ఇది డిసెంబర్ 2024 ప్రారంభం నుంచి ప్రారంభమవుతుంది. ఎస్‌బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీ మారింది. ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్‌లు పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫీజు
ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు ఫీజులు, రివార్డ్ ప్రోగ్రామ్ వంటి వాటిని నవీనీకరిస్తుంది. ఇది ఇన్సూరెన్స్ కిరాణా కొనుగోళ్లు, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌తో సహా వివిధ సేవలపై ప్రభావం చూపుతుంది. ఈ నియమాలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను మార్చింది.

ఆర్‌బీఐ కొత్త డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫ్రేమ్‌వర్క్
డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్స్ (DMT) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు కూడా ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి. ఈ చొరవ దేశీయ నగదు బదిలీలలో భద్రతను మెరుగుపరచడం, నవీకరించబడిన ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. 24 జులై 2024 సర్క్యులర్‌లో బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల లభ్యత, కేవైసీ అవసరాలను సులభంగా నెరవేర్చడంలో గణనీయమైన పెరుగుదల ఉందని వెల్లడించింది.

ఇదీ చదవండి: నెలకో రూ.లక్ష.. రిటైర్మెంట్‌ ప్లాన్‌ ఇలా..

ఐఆర్‌సీటీసీ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్
ఐఆర్‌సీటీసీ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్ కొత్త నిబంధనలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి. ఇప్పటి వరకు 120 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఇండియన్ రైల్వే కల్పించింది. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ 120 రోజులను 60 రోజులకు కుదించింది. అంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు రెండు నెలల ముందు మాత్రమే బుక్ చేసుకోగలరు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)