Breaking News

రుణ మార్గదర్శకాలు కఠినతరం

Published on Wed, 10/09/2024 - 08:32

మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు ‘రుణ పూచీకత్తు’ మార్గదర్శకాలను కఠినతరం చేసినట్లు స్వీయ నియంత్రణ సంస్థ–మైక్రో ఫైనాన్స్‌ ఇండస్ట్రీ నెట్‌వర్క్‌ (ఎంఫిన్‌) ప్రకటించింది. మైక్రో ఫైనాన్స్‌ సంస్థల నుంచి అప్పు తీసుకునేవారికి భారం పెరిగిపోతోందని, దీనితో తీసుకున్న రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోతున్నారన్న  ఆందోళనల నేపథ్యంలో ఎంఫిన్‌ తాజా నిర్ణయం తీసుకుంది.  

రుణాల్లో నెలకొన్న ప్రస్తుత సవాళ్ల పరిష్కారానికి తాజా చర్య దోహదపడుతుందని ఎంఫిన్‌ తెలిపింది. బుల్లెట్‌ రీపేమెంట్‌ (రుణ వ్యవధిలో అప్పటికి చెల్లింపులు జరిపింది పోగా మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లిచడం), చెల్లించని ఈఎంఐల గురించి ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్‌ సంస్థల వద్ద తగిన సమాచారం అందడంలేదని ఎంఫిన్‌ తెలిపింది. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రస్తుత మార్గదర్శకాలు దోహపదడతాయని ప్రకటన వివరించింది. అయితే మార్గదర్శకాలు ఏమిటన్నది నిర్ధిష్టంగా తెలియరాలేదు.

ఇదీ చదవండి: తగ్గిద్దామా? వద్దా?

ఇక ఒకే రుణగ్రహీత ఐదేసి రుణాలను తీసుకున్న పలు సందర్భాలూ వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వ్యవహారాలు ఆందోళనను సృష్టిస్తున్నాయి. ఒక రుణ గ్రహీత నెలవారీ సంపాదన ఎంత? చెల్లింపుల సామర్థ్యం ఏమిటి? అనే అంశాలపైనా మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు తగిన సమాచారం లేకపోవడం సమస్యకు మరో కారణం. ఆయా అంశాలు మైక్రో ఫైనాన్స్‌ సంస్థల రుణ నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. సంబంధిత వర్గాల నుంచి ఆరు నెలలకు పైగా అందిన సమాచారం మేరకు 12 కోట్ల రుణ రికార్డులను విశ్లేషించిన తర్వాత కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే మార్గదర్శకాలపై త్వరలో పూర్తి సమాచారం వెలువడనుంది.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)