Breaking News

పాలసీను సరెండర్‌ చేస్తే ఎంత వస్తుందంటే..?

Published on Tue, 10/01/2024 - 14:49

జీవిత బీమా పాలసీని వెనక్కిచ్చేసినప్పుడు (సరెండర్‌) పొందే ప్రయోజనాలపై నూతన నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం గతంలో కంపెనీలిచ్చే సరెండర్‌ వాల్యూ పెరగనుంది. ప్రస్తుతం కంపెనీలు అమలు చేస్తున్న నియమాలు ఎలా ఉన్నాయో, కొత్త విధానం అమలులోకి వస్తున్న నేపథ్యంలో ఎంతమేరకు సరెండర్‌ వాల్యూ వస్తుందో తెలుసుకుందాం.

జీవిత బీమా పాలసీల గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, ముందస్తుగానే వైదొలగాలని భావించే వారికి మెరుగైన రాబడులు అందించడమే కొత్త నిబంధనల ఉద్దేశం. జీవిత బీమా పాలసీని తీసుకున్న తర్వాత నుంచి ఎన్నేళ్ల పాటు ప్రీమియం చెల్లించారు, అప్పటి వరకు ఎంత బోనస్‌లు జమయ్యాయన్న తదితర అంశాల ఆధారంగా సరెండర్‌ వ్యాల్యూని బీమా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ఇలా సరెండర్‌ చేసే పాలసీలపై బీమా సంస్థలు గతంలో తక్కువ ప్రయోజనాలనే పాలసీదారులకు చెల్లించేవి. ఉదాహరణకు ఎల్‌ఐసీలో వినయ్‌(35) వనే వ్యక్తి జీవన్‌ ఆనంద్‌ పాలసీను ఎంచుకున్నాడనుకుందాం. పాలసీ కాలం ముప్పై ఏళ్లు. పాలసీ మొత్తం రూ.10 లక్షలుగా భావిస్తే, వినయ్‌ నెలవారీ దాదాపు రూ.3,175 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏటా రూ.38,100 చెల్లించాలి. ఐదేళ్లు పాలసీ ప్రీమియం చెల్లించాలరనుకుందాం. రూ.38,100*5 మొత్తం రూ.1,90,500. ఐదేళ్ల తర్వాత వినయ్‌ తన పాలసీను సరెండర్‌ చేస్తే తనకు 30-35 శాతం సరెండర్‌, ఇతర ఛార్జీలు విధించి రూ.1,27,863 మాత్రమే కంపెనీ చెల్లిస్తుంది. మిగతా రూ.62,637 నష్టపోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: వాటర్‌ బాటిల్‌ ధర తగ్గనుందా..?

కొత్త నిబంధనల ప్రకారం సరెండర్‌ చేసే పాలసీపై  సరెండర్‌ ఛార్జీలు, ఇతర ఛార్జీలను తగ్గించనున్నారు. దాంతో పాలసీదారుడికి గతంలో కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు సమకూరుతుంది. ఇదిలాఉండగా, కేవలం డబ్బు కోసమే పాలసీను సరెండర్‌ చేయాలనుకునేవారికి మరో అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పైన తెలిపిన ఉదాహరణలో వినయ్‌ చెల్లించిన ఐదేళ్ల పాలసీ ప్రీమియంను ఉపయోగించి లోన్‌ తీసుకునే వెసులుబాటు ఉంది. పాలసీను సరెండర్‌ చేస్తే రూ.1,27,863 వస్తుంది కదా. అదే తన పాలసీపై లోన్‌కు వెళితే సుమారు రూ.89,500 వరకు పొందే అవకాశం ఉంది. దాంతో పాలసీ కొనసాగించేలా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)