Breaking News

ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీ ఫోన్‌ వచ్చేస్తోంది..

Published on Fri, 08/22/2025 - 14:03

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ మేకర్‌ రియల్‌మీ తన రాబోయే స్మార్ట్‌ఫో న్ లాంచ్ తేదీని టీజ్ చేసింది. బ్యాటరీ విషయంలో ఇది "పెద్ద" డీల్ అంటూ ఊరిస్తోంది. దీని పేరును ఇంకా వెల్లడించనప్పటికీ, కొత్త రియల్‌మీ డివైస్ 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్‌లో టీజ్ చేసింది.

"ఇంత పెద్దది సరిపోతుందా? ఇదిగో రియల్‌మీ 1x000mAh - మరోసారి  పరిమితులను చెరిపేస్తుంది. ఆగస్టు 27న అద్భుతం చూడండి' అంటూ రియల్‌మీ పోస్ట్ చేసింది.  "అతిపెద్దది మరింత పెద్దదిగా మారింది. రియల్‌మీ మరోసారి పరిమితులను పునర్నిర్వచించనుంది. 320వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ నుంచి 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వరకు... తర్వాత ఏం జరగబోతోంది?" అని మరో ఎక్స్ పోస్ట్ లో పేర్కొ​ంది.

అంటే ఈ స్మార్ట్ ఫోన్ లో అధునాతన బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నాలజీ ఉండొచ్చని తెలుస్తోంది. రియల్‌మీ రాబోయే డివైజ్ 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని దాటుతుందా అని చాలా మంది ఆలోచిస్తున్నారు.  ప్రస్తుతం రియల్‌మీలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ ఉన్న  స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మీ జీటీ 7. చైనీస్ మోడల్లో ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,200 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంది. అదే ఇండియన్ రియల్‌మీ జీటీ 7 వెర్షన్‌లో అయితే 120వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో  7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Videos

Anantha Venkatarami Reddy: నీ తల్లి అయితే ఒకటి ఎన్టీఆర్ తల్లి అయితే మరొకటా

'ధర్మస్థల' కేసులో మరో భారీ ట్విస్ట్

మహిళపై చేయి చేసుకున్న ఎస్ఐ

జనాలకు అర్థమైంది..? ఏపీలో సాక్షి టీవీ కోసం డిమాండ్స్

Viral Video: వామ్మో..! కోబ్రాతో చెడుగుడు ఆడుకున్నబుడ్డోడు!

చైనాకు దగ్గరవుతోన్న భారత్? టిక్ టాక్ రీ ఎంట్రీ.. నిషేధంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

7 కోట్ల స్థలం 50 లక్షలకే.. ఆంధ్రజ్యోతికి ఇవ్వాలనుకొని బొక్క బోర్లాపడ్డ టీడీపీ

పాఠశాలలో పిల్ల ఏనుగు

కుక్కలతో మాట్లాడుతున్న రాజేష్

ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. నారా రోహిత్ షాకింగ్ రియాక్షన్

Photos

+5

ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)

+5

తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?