Breaking News

ఇన్వెస్కో, కోటక్‌.. న్యూ ఫండ్‌ ఆఫర్స్‌

Published on Mon, 09/21/2026 - 17:22

ఇన్వెస్కో మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా రెండు ఫండ్స్‌ను ఆవిష్కరించింది. నిఫ్టీ ఇండియా డిఫెన్స్‌ ఇండెక్స్‌ ఫండ్, నిఫ్టీ కెమికల్‌ ఇండెక్స్‌ ఫండ్‌ వీటిలో ఉన్నాయి. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్స్‌ (ఎన్‌ఎఫ్‌వో) సెప్టెంబర్‌ 29 వరకు అందుబాటులో ఉంటాయి. వీటిలో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. సిప్‌ విధానంలో వ్యవధిని బట్టి రూ. 20 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. డిఫెన్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనేది నిఫ్టీ ఇండియా డిఫెన్స్‌ ఇండెక్స్‌కి అనుగుణమైన ఈక్విటీలు, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది.  ఇక కెమికల్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనేది నిఫ్టీ కెమికల్‌ ఇండెక్స్‌కి అనుగుణమైన ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ప్యాసివ్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

కోటక్‌ నిఫ్టీ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌

ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం, పెట్టుబడి పెట్టేందుకు అనువైన సాధనాలు పెరుగుతుండటంలాంటి సానుకూలాంశాలతో  గత కొన్నేళ్లుగా దేశీయ క్యాపిటల్‌ మార్కెట్ల వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. దీనితో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, ఎక్సే్చంజీలు, బ్రోకింగ్‌ సంస్థలు మొదలైన వివిధ విభాగాలవ్యాప్తంగా పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే వీటిలో ప్యాసివ్‌గా ఇన్వెస్ట్‌ చేసేందుకు తోడ్పడేలా కోటక్‌ నిఫ్టీ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రవేశపెట్టింది కోటక్‌ మహీంద్రా ఏఎంసీ. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) నిఫ్టీ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుందని ఫండ్‌ మేనేజర్‌ సతీష్‌ దొండపాటి తెలిపారు. ఈ ఫండ్‌ సెప్టెంబర్‌ 29తో ముగుస్తుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)