Breaking News

మహీంద్రా థార్ మళ్లీ మార్కెట్‌లోకి.. కాస్త కొత్తగా..

Published on Sat, 10/04/2025 - 14:26

మహీంద్రా తన ప్రసిద్ధ ఆఫ్-రోడర్ అయిన థార్ (Mahindra Thar) రిఫ్రెష్ వేరియంట్‌ను (facelift) భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కొత్త థార్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరను రూ. 9.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ అప్డేట్ మోడల్, థార్‌ కోర్ బాక్సీ డిజైన్, ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కొనసాగిస్తూనే, రోజువారీ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక సౌకర్యాలు, కనెక్టివిటీ ఫీచర్లు, కొంతమేర ఎక్స్టీరియర్మార్పులతో వచ్చింది.

ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లు

ఇంటీరియర్‌లో పెద్దదైన 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ (ఆండ్రాయిడ్ఆటో, యాపిల్కార్ప్లేసహా), రియర్ ఏసీ వెంట్స్, స్లైడింగ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, రీడిజైన్ అయిన డాష్‌బోర్డ్, కొత్త స్టీరింగ్ వీల్, రీ-లొకేట్ చేసిన పవర్ విండో స్విచ్‌లు ఉన్నాయి.

ఇక ఎక్స్టీరియర్విషయానికి వస్తే బాడీ-కలర్ ఫ్రంట్ గ్రిల్, వాషర్‌తో రియర్ వైపర్, స్పేర్ వీల్ హబ్‌లో పార్కింగ్ కెమెరా, కొత్తగా టాంగో రెడ్, బాటిల్ షిప్ గ్రే కలర్షేడ్లు కొత్త వేరియంట్లో అప్డేట్అయ్యాయి.

ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్

థార్ మూడు ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి.. 2.0-లీటర్ ఎంస్టాలిన్పెట్రోల్, 2.2-లీటర్ ఎంహాక్డీజిల్, డీ117 సీఆర్డీఈ డీజిల్. ఇవి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తాయి. డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో ఆర్డబ్ల్యూడీ, డ్రైవ్ లైన్ డిస్‌కనెక్ట్ ఫీచర్‌తో కూడిన 4x4 వేరియంట్లు ఉన్నాయి. వీటివల్ల థార్‌ను సిటీ వాహనంగానూ, వీకెండ్ ఆఫ్-రోడర్‌లాగానూ ఉపయోగించవచ్చు.

ధరలు (ఎక్స్-షోరూమ్)

ఎంట్రీ-లెవల్ ఏఎక్స్టీ ఆర్డబ్ల్యూడీ ఎమ్టీ ట్రిమ్ ధర రూ. 9.99 లక్షలు.

టాప్-ఎండ్ ఎల్ఎక్స్టీ 4డబ్ల్యూడీ ఏటీ ట్రిమ్ ధర రూ. 16.99 లక్షలు

4డబ్ల్యూడీ ఆటోమేటిక్ వేరియంట్ల ధర రూ. 16 లక్షలు

సౌకర్యం & ప్రాక్టికాలిటీ:

కొత్తగా A-పిల్లర్ గ్రాబ్ హ్యాండిల్స్, ఇంధన మూతకు ఇంటీరియర్ ఓపనింగ్ మెకానిజం, అదనంగా యూఎస్బీ టైప్-సీ పోర్ట్స్ వంటివి జోడించడం వల్ల రోజువారీ ఉపయోగంలో థార్ మరింత ప్రాక్టికల్‌గా మారింది.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో తొలి టెస్లా కారుకు వాహన పూజ..

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)