Breaking News

కొత్త ఇన్సూరెన్స్‌ ప్లాన్లు: స్థిరమైన ఆదాయం, పిల్లల భవిష్యత్తు

Published on Mon, 05/04/2026 - 07:32

న్యూఢిల్లీ: అవీవా ఇండియా ‘అవీవా సెక్యూర్‌ నెస్ట్‌ యాన్యూటీ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. సింగిల్‌ ప్రీమియంతో స్థిరమైన ఆదాయాన్ని పొందే పరిష్కారమే ఈ ప్లాన్‌ అని సంస్థ ప్రకటించింది. 80 ఏళ్ల వయసు వరకు ఈ ప్లాన్‌లోకి ప్రవేశించొచ్చు. ఈ ప్లాన్‌ కింద ఒకరికి లేదంటే ఉమ్మడిగా కవరేజీని కూడా పొందొచ్చు.

మరణానంతరం నామినీలకు కొనుగోలు ధరను చెల్లించే సదుపాయం కూడా ఉంది. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్లాన్‌ పనిచేస్తుందని అవీవా ఇండియా తెలిపింది. జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్‌ ద్వారా భరోసా ఇస్తున్నట్టు అవీవా ఇండియా ఎండీ, సీఈవో అసిత్‌ రథ్‌ తెలిపారు.  

బజాజ్‌ లైఫ్‌ ‘యంగ్‌ అచీవర్‌ ప్లాన్‌’ 
బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చదువుకునే పిల్లల పేరిట సంపద సృష్టితోపాటు, వారి భవిష్యత్‌ లక్ష్యాలకు కవరేజీతో కూడిన ‘బజాజ్‌ లైఫ్‌ యంగ్‌ అచీవర్‌ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లల కోసం కావాల్సినంత నిధిని (హామీతో కూడిన) సమకూర్చుకోవచ్చు. తల్లి/తండ్రి మరణిస్తే లేదా వైకల్యం పాలు కావడం లేదంటే ఎంపిక చేసిన 25 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్‌ ఇల్‌నెస్‌) ఏదేనీ బారిన పడితే, ఆ తర్వాత భవిష్యత్‌ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు.

పాలసీ యథావిధిగా కొనసాగుతుంది. ఒకే విడత చెల్లింపులు లేదా పిల్లల భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా క్రమానుగతంగా ఆదాయం అందుకునే ఆప్షన్లలో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. 5–12 ఏళ్ల మధ్య ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులకు, చివర్లో అందుకునే ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలున్నాయి.

Videos

LIVE : దూసుకుపోతున్న విజయ్

సీఎం స్టాలిన్ ఓటమి...! విజయ్ దెబ్బ అదుర్స్

తమిళనాడులో విజయ్ తుఫాన్, దళపతికి పట్టం కట్టిన ZenG

నా తమ్ముడు విజయ్... జగన్ ఎమోషనల్ కామెంట్స్

విజయ్ విజయం త్రిష సంచలన కామెంట్స్

DMK ఓటమికి కారణం ఇదే..

విజయంపై విజయ్ తల్లి ఫస్ట్ రియాక్షన్

ఇక్కడ జగన్.. అక్కడ విజయ్, TVK విజయోత్సవంలో YSRCP సంబరాలు

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయంపై NV. సుభాష్

విజయ్ గెలుపుపై తండ్రి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)

+5

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)