Breaking News

మతపరమైన సంస్థలకు పన్ను మినహాయింపులు

Published on Tue, 08/12/2025 - 05:02

న్యూఢిల్లీ: అన్ని మతపరమైన, స్వచ్ఛంద సేవా సంస్థలకు వచ్చే అజ్ఞాత విరాళాలపై టీడీఎస్‌ క్లెయిమ్, పన్ను మినహాయింపులకు ప్రస్తుత చట్టంలో మాదిరే ఆదాయపన్ను కొత్త బిల్లు (2.0)లోనూ అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొచి్చన కొత్త బిల్లులో దీన్ని తొలగించడం గమనార్హం. అన్ని రిజిస్టర్డ్‌ స్వచ్ఛంద సేవా సంస్థలు అందుకునే అజ్ఞాత విరాళాలపై 30 శాతం స్థిర పన్నును ప్రభుత్వం ప్రతిపాదించింది. 

కానీ, సెలక్ట్‌ కమిటీ చేసిన సూచనల మేరకు నూతన బిల్లులో మినహాయింపులకు తిరిగి చోటు కల్పించింది. క్లాజు 187 కింద ‘ప్రొఫెషన్‌’ పదాన్ని చేర్చారు. ఒక ఏడాదిలో చెల్లింపుల స్వీకరణలు రూ.50 కోట్లకు మించితే నిపుణులు సైతం ఎల్రక్టానిక్‌ చెల్లింపుల నమూనాలను కలిగి ఉండాలని ఇది నిర్దేశిస్తోంది. నష్టాలను సర్దుబాటు చేసుకోవడం, క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవడానికి సంబంధించిన నిబంధనలను మరింత మెరుగుపరిచారు. 

టీడీఎస్‌ కరెక్షన్‌ స్టేట్‌మెంట్‌ (సవరణ నివేదికలు)లకు సంబంధించి దాఖలు గడువును ఆరేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు. నూతన ఆదాయపన్ను బిల్లు (2.0)గా చెబుతున్న తాజా బిల్లులో సెలక్ట్‌ కమిటీ సిఫారసులు అన్నింటికీ దాదాపుగా చోటు కల్పించడం గమనార్హం. తొలుత ఈ కొత్త బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టగా, సెలక్ట్‌ కమిటీకి సిఫారసు చేశారు. సెలక్ట్‌ కమిటీ తన నివేదికను జూలై 21న పార్లమెంట్‌కు సమరి్పంచింది. సోమవారం దీన్ని లోక్‌సభ ఆమోదించింది.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)