Breaking News

క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..

Published on Tue, 11/26/2024 - 14:51

క్రెడిట్ కార్డులు వినియోగించేవారి సంఖ్య ఒకప్పటి నుంచి గణనీయంగా పెరుగుతూనే ఉంది. చిన్న స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి.. లక్షలు సంపాదించే పెద్ద ఉద్యోగి వరకు అందరూ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే గత అక్టోబర్ నెలలో 7.8 లక్షల మంది మాత్రమే క్రెడిట్ కార్డులను తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఖ్య 2023 అక్టోబర్ (16 లక్షలు) నెలతో పోలిస్తే 45 శాతం తగ్గినట్లు స్పష్టమైంది. దీన్ని బట్టి చూస్తే క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా? అనే అనుమానం కూడా వస్తోంది.

ఆనంద్ రాతీ నివేదిక ప్రకారం, 2024 మే నెలతో పోలిస్తే.. అక్టోబర్‌లో క్రెడిట్ కార్డులు జారీ కొంత పెరిగిందని తెలుస్తోంది. అక్టోబర్ 2024లో క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన మొత్తం ఖర్చు రూ. 1.78 ట్రిలియన్‌లకు చేరుకుందని, ఇది 13 శాతం వార్షిక వృద్ధిని ప్రతిబింబిస్తుందని సమాచారం. మొత్తం ఖర్చు విలువలో ఈ కామర్స్ వాటా 61 శాతం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

గత ఏడాదితో పోలిస్తే.. ఈ అక్టోబర్ నెలలో జారీ అయిన క్రెడిట్ కార్డుల సంఖ్య తక్కువ అయినప్పటికీ.. ఖర్చులు మాత్రం గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాలామంది ఏది కొనాలన్నా.. ఎక్కడ షాపింగ్ వంటివి చేయాలన్నా క్రెడిట్ కార్డులనే వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులు పెరుగుతున్నాయి. మొత్తం మీద క్రెడిట్ కార్డుల జారీ తగ్గినా.. వినియోగంలో మాత్రం ఎవ్వరూ తగ్గేదేలే అనేది స్పష్టంగా అర్దమైపోతోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)