Breaking News

ముందస్తు విత్‌డ్రాకు ఆర్‌బీఐ నిబంధనలు

Published on Tue, 08/13/2024 - 06:08

ముంబై: ఎన్‌బీఎఫ్‌సీల్లో డిపాజిట్‌ చేసిన మూణ్నెల్ల వ్యవధిలోనే డిపాజిటర్లు అత్యవసర పరిస్థితుల కోసం మొత్తం డబ్బును వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రిమెచ్యూర్‌ విత్‌డ్రాయల్స్‌పై వడ్డీ లభించదని పేర్కొంది. నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) నిబంధనలను సమీక్షించిన సందర్భంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.

 వైద్యం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రభుత్వం ప్రకటించే విపత్తులను అత్యవసర పరిస్థితులుగా పరిగణిస్తారు. మరోవైపు, డిపాజిట్లు స్వీకరించే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీ) పాటించాల్సిన లిక్విడ్‌ అసెట్స్‌ పరిమాణాన్ని అవి ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లలో 13 శాతం నుంచి 15 శాతానికి ఆర్‌బీఐ పెంచింది. అలాగే, పబ్లిక్‌ డిపాజిట్లకు అన్ని వేళలా పూర్తి కవరేజీ ఉండేలా చూసుకోవాలని, ఏడాదికి ఒకసారైనా క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల నుంచి ’ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌’ రేటింగ్‌ పొందాలని హెచ్‌ఎఫ్‌సీలకు సూచించింది. పబ్లిక్‌ డిపాజిట్లను 12 నెలల నుంచి 60 నెలల్లోపు తిరిగి చెల్లించేయాల్సి ఉంటుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)