Breaking News

షాకిచ్చిన గూగుల్‌..నౌకరి.కామ్‌ యాప్‌ మాయం!

Published on Fri, 03/01/2024 - 20:46

భారత్‌లోని ప్రముఖ లార్జెస్ట్‌ వెబ్‌సైట్‌ నౌకరి.కామ్‌ యాప్‌ ప్లేస్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.  

గూగుల్‌, భారత్‌లోని యాప్‌ డెవలపర్ల మధ్య కొంతకాలంగా ప్లే స్టోర్‌ ఛార్జీల వివాదం కొనసాగుతోంది. భారత్‌లోని కొన్ని కంపెనీలు సర్వీస్‌ ఛార్జీలు చెల్లించకుండా గూగుల్‌ ప్లే స్టోర్‌ని వినియోగించుకుంటున్నాయని తెలిపింది. ఆయా సంస్థలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని, లేదంటే ప్లేస్టోర్‌ నుంచి సంబంధిత సంస్థల యాప్స్‌లను తొలగిస్తామని ప్రకటించారు.

నిబంధనల్ని పాటించాం.. 
ఈ తరుణంలో ఇన్ఫో ఎడ్జ్ యాజమాన్యంలోని నౌకరి, రియల్ ఎస్టేట్‌కు చెందిన 99 ఎకర్స్‌ యాప్స్‌ను ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించింది. ఈ సందర్భంగా గూగుల్ యాప్ బిల్లింగ్ పాలసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఫిబ్రవరి 9 నుండి తాము గూగుల్ యాప్ విధానాలకు కట్టుబడి ఉన్నామని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్‌చందానీ గతంలో చెప్పారు. గూగుల్ బకాయిలన్నీ సకాలంలో చెల్లించామని తెలిపారు.

భారత్‌లో 10 యాప్స్‌ తొలగింపు
తాజాగా ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను తొలగించడంపై సంజీవ్‌ బిక్‌చందానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఇన్ఫో ఎడ్జ్‌కి చెందిన నౌకరి, 99 ఎకర్స్‌తో కలిపి మొత్తం 10 యాప్స్‌ను ప్లేస్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించిన విషయం తెలిసిందే. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు