Breaking News

నేటి నాన్నకు.. ‘మల్టీ అసెట్‌’ బాసట

Published on Mon, 06/16/2025 - 03:19

నేటి తరంలో తండ్రులు ఏకకాలంలో అనేక పాత్రలను పోషించాల్సి వస్తోంది. కుటుంబం.. ఉద్యోగ బాధ్యతలను చూసుకోవడం, పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రణాళికలు వేస్తూనే ఆర్థిక భద్రతకు ప్లానింగ్‌ చేయడం, మరో ఇంటిని కొనుగోలు చేయడం, విహారయాత్రల ప్లానింగ్, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం, రిటైర్మెంట్‌ కోసం ప్రణాళికలు వేసుకోవడం ఇలా అనేకానేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది. ఇలాంటి వైవిధ్యమైన అవసరాలను తీర్చాలంటే సంప్రదాయ పద్ధతిలో పొదుపు చేస్తే సరిపోదు.

దీని కోసం నిర్దిష్ట లక్ష్యంతో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అందుకే ఫాదర్స్‌ డే సందర్భంగా తమకిష్టమైన వారి భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో ఆధునిక తండ్రులకు బాసటగా ఉంటున్న మల్టీ అసెట్‌ ఫండ్స్‌పై ఒకసారి దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది.  
నేటి తరం తండ్రుల్లో ఈ కేటగిరీ ఇంతగా ప్రాచుర్యం పొందడానికి కారణాలేమిటంటే..  

వైవిధ్యం 
వివిధ బాధ్యతలు తలో వైపునకు లాగేసే పరిస్థితుల్లో వివిధ సాధనాలవ్యాప్తంగా తమ పెట్టుబడులను రీబ్యాలెన్స్‌ చేసుకునేందుకు లేదా వేర్వేరు ఫండ్స్‌ను నిర్వహించుకునేందుకు నాన్నలకు తగినంత సమయం ఉండటం లేదు. మల్టి–అసెట్‌ ఫండ్స్‌ ఈ విధులను ఆటోమేటిక్‌గా నిర్వహిస్తాయి. దీనితో పెట్టుబడుల కేటాయింపు, రిసు్కల సర్దుబాటు సముచితమైన విధంగా ఉంటుంది.  

డైనమిక్‌గా కేటాయింపులు 
మల్టీ అసెట్‌ ఫండ్స్‌ కూడా క్రియాశీలకంగా ఉంటాయి. స్థూల ఆర్థిక సూచీలు, మార్కెట్‌ సెంటిమెంట్, వేల్యుయేషన్లను బట్టి చాలా మటుకు ఫండ్స్‌ మేనేజర్లు వ్యూహాత్మకంగా కేటాయింపులను మారుస్తూ ఉంటారు. వృద్ధి, మందగమన దశల్లో ఇన్వెస్టర్లు సమర్ధవంతంగా ముందుకెళ్లేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.  

సరళతరంగా ప్రణాళికలు 
పదేళ్ల తర్వాత పిల్లల చదువుల కోసం పొదుపు చేయడం కావచ్చు లేదా ముందస్తుగానే రిటైర్‌ అయ్యేందుకు అవసరమైన నిధి సమకూర్చుకో వడం.. లక్ష్యం ఏదైనా సరే సరళతరమైన పెట్టుబడి మార్గాన్ని ఈ ఫండ్స్‌ అందిస్తాయి. ఒక్కో లక్ష్యం కోసం అనేకానేక పోర్ట్‌ఫోలియోలను నిర్వహించుకోవాల్సిన బాదరబందీ లేకుండా, తమ రిస్కు సామర్థ్యాలు, కాలవ్యవధిని బట్టి వైవిధ్యమైన ఒకే సాధనంలో సిప్‌ చేయడం సులభతరంగా ఉంటుంది.  

వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడం.. రిస్కులను అధిగమించడం 
ఈక్విటీ ఆధారిత వ్యూహాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాయి. డెట్‌ ఆధారిత పోర్ట్‌ఫోలియోలనేవి ద్రవ్యోల్బణానికన్నా తక్కువగా రాబడులు అందించే అవకాశాలు ఉన్నాయి. ఇక పుత్తడిని తీసుకుంటే ఎక్కువగా సంక్షోభ సమయాల్లోనే మాత్రమే మెరుస్తుంది. కానీ వీటన్నింటినీ సమతూకంలో మేళవించి, సరిగ్గా నిర్వహించుకోగలిగితే, దీర్ఘకాలంలో అర్ధవంతమైన రాబడులను అందిస్తాయి. షాక్‌లు కూడా తగ్గుతాయి. కాలక్రమేణా ఆర్థిక స్థిరత్వ సాధనను లక్ష్యంగా పెట్టుకున్న వారు రిస్కులకు తగ్గ వృద్ధి అవకాశాలను పొందేందుకు ఈ వ్యూహం అనుకూలంగా ఉంటుంది. 

అనిశ్చితిలోనూ నిశ్చింత 
పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో సముచిత స్థాయిలో వైవిధ్యంగా ఉండటంతో పాటు ప్రొఫెషనల్స్‌ నిర్వహణలో ఉంటుందనే విషయం తెలియడం వల్ల ఎంతో నిశ్చింతగా ఉంటుంది. ఫండ్‌ మేనేజర్లు ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తూ, లోతైన పరిశోధనలు చేస్తూ, ఆర్థిక ధోరణులను విశ్లేíÙస్తూ, రిసు్కలను తగ్గించి రాబడులను పెంచే విధంగా పోర్ట్‌ఫోలియోను క్రియాశీలకంగా రీబ్యాలెన్స్‌ చేస్తూ ఉంటారు.

దీనితో వివిధ రకాల పెట్టుబడులను వేర్వేరుగా పరిశోధించి, ఎంచుకుని, ఇన్వెస్ట్‌ చేసేందుకు బోలెడంత సమయం వెచి్చంచాల్సిన భారం తండ్రులకు కాస్త తగ్గుతుంది. ఇటు కెరియర్లు అటు కుటుంబ బాధ్యతల మధ్య నిరంతరం పరుగులు తీసే తండ్రులకు ఈ విధానం ఎంతో ఉపశమనంగా ఉంటుంది. మార్కెట్‌ హడావుడి గురించి ఆందోళన చెందకుండా వారు ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా, తమ పిల్లల క్రికెట్‌ గేములు.. సైన్స్‌ ప్రాజెక్టులపై  దృష్టి పెట్టేలా మల్టి–అసెట్‌ ఫండ్స్‌ సహకరిస్తాయి. 

నేటి నాన్న ఏదో కాస్త పొదుపు లేదా ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌కి మాత్రమే పరిమితం కావడం లేదు. కుటుంబం నేటి ఆనందాలను కోల్పోకుండా చూసుకోవడంతో పాటు భవిష్యత్తులోనూ సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేందుకు అన్ని విషయాలూ తెలుసుకుని, చురుగ్గా వ్యవహరిస్తూ, తగిన పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు సన్నద్ధంగా ఉంటున్నారు. మల్టీ అసెట్‌ ఫండ్స్‌ ఇలాంటి సమతూకాన్నే ప్రతిఫలిస్తాయి. సంరక్షకుడిగా, ప్రణాళిక కర్తగా, భాగస్వామిగా, అన్నింటికీ మించి ఒక పేరెంట్‌గా వివిధ పాత్రలను పోషించే తండ్రులకు సమగ్రమైన, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణమైన పెట్టుబడి ఆప్షన్‌గా మల్టీ అసెట్‌ ఫండ్స్‌ ఉపయోగపడతున్నాయి.  
ఇలా తమ కోసమే కాకుండా రాబోయే తరాల కోసం కూడా ఆర్థికంగా కొత్త బాటలు వేస్తున్న తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్‌ డే!  

మల్టీ–అసెట్‌ ఫండ్స్‌ అంటే .. 
ఇవి కనీసం మూడు వేర్వేరు ఆర్థిక సాధనాల్లో, అంటే ఈక్విటీలు, డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, పసిడిలాంటి కమోడిటీల మేళవింపులో ఇన్వెస్ట్‌ చేస్తాయి. కొన్ని కొంత వరకు రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులు (రీట్స్‌) లేదా ఇంటర్నేషనల్‌ ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టే సౌలభ్యాన్ని కూడా అందిస్తాయి. ఇక్కడ డైవర్సిఫికేషన్‌ అనేది ఇక్కడ కీలకాంశం. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)