Breaking News

డెట్‌ ఫండ్స్‌లో కొనసాగుతున్న అమ్మకాలు

Published on Tue, 03/14/2023 - 04:22

న్యూఢిల్లీ: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ వరుసగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరిలో డెట్‌ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.13,815 కోట్ల మేర నికరంగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డెట్‌ ఫండ్స్‌ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు తరలిపోవడం వరుసగా మూడో నెలలోనూ చోటు చేసుకుంది.

ఈ ఏడాది జనవరిలో రూ.10,316 కోట్లు, గత డిసెంబర్‌లో రూ.21,947 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేష్‌ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022 నవంబర్‌లో డెట్‌ ఫండ్స్‌లోకి రూ.3,668 కోట్ల మేర వచ్చాయి. డెట్‌లో మొత్తం 16 విభాగాలు ఉంటే, తొమ్మిది విభాగాల్లోని పథకాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిగిలిన విభాగాల్లోకి పెట్టుబడులు వచ్చాయి.

విభాగాల వారీగా..   
► లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి అత్యధికంగా రూ.11,304 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.  
► అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ నుంచి రూ.2,430 కోట్లు, లో డ్యురేషన్‌ ఫండ్స్‌ నుంచి రూ.1,904 కోట్లు, ఫ్లోటర్‌ ఫండ్స్‌ నుంచి రూ.1,665 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు.  
► ఓవర్‌నైట్‌ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.2,946 కోట్ల అమ్మకాలు చేశారు. ఆ తర్వాత కార్పొరేట్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌లో రూ.662 కోట్లు, డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌లోకి రూ.502 కోట్లు, గిల్ట్‌ ఫండ్స్‌లోకి రూ.451 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.  
► డెట్‌ విభాగంలో లిక్విడ్, అల్ట్రా షార్ట్‌ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్‌నైట్‌ ఫండ్‌ విభాగాలు 50 శాతానికి పైగా ఆస్తులు కలిగి ఉన్నాయి. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)