Breaking News

వీధి వ్యాపారులకు రూ.5 లక్షల వరకు రుణం

Published on Tue, 12/03/2024 - 11:37

ప్రైవేటు రుణ రంగంలో ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ వన్‌ సంచలనాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్న వ్యాపారుల బ్యాలెన్స్‌ షీట్లతో కాకుండా తమ లావాదేవీల ఆధారంగా వ్యాపారాలను అంచనా వేసి వారికి లోన్ల ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో వీధి వ్యాపారులు సైతం ఇప్పుడు రూ.5 లక్షల వరకు రుణాలు పొందవచ్చని పేర్కొంది.

రోజువారీ వసూళ్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత యాప్‌లను ఉపయోగించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలకు రోజువారీ చెల్లింపు సౌకర్యంతో రుణాలను అందిస్తామని ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ వన్‌ వెల్లడించింది. ‘ఇది చిన్న వ్యాపారాల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జులై 23న తన బడ్జెట్‌ ప్రెజెంటేషన్‌లో ప్రకటించిన న్యూ క్రెడిట్‌ అసెస్‌మెంట్‌ మోడల్‌కు అనుగుణంగా ఉంది. ఈ మోడల్‌ కింద బ్యాంకులు చిన్న వ్యాపారుల బ్యాలెన్స్‌ షీట్లతో కాకుండా డిజిటల్‌ లావాదేవీల ఆధారంగా వ్యాపారాలను అంచనా వేయాలి. బలమైన నగదు రాక ఉన్నప్పటికీ రుణం పొందడంలో వ్యాపారులు విఫలం చెందుతున్నారు. ఇటువంటి వారు క్యూఆర్‌ కోడ్‌ లావాదేవీల ఆధారంగా రుణం అందుకోవచ్చు’ అని కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: మస్క్‌ వేతన ప్యాకేజీపై కోర్టు తీర్పు

ఈ సందర్భంగా ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ వన్‌ సీఈవో చందన్‌ ఖైతాన్‌ మాట్లాడుతూ.. భారత్‌లో దాదాపు 6 కోట్ల అనధికారిక సూక్ష వ్యాపారాలు ఉన్నాయన్నారు. ఇవి దేశంలోని అతిపెద్ద ఉపాధి సృష్టికర్తలలో ఒకటని, దేశ జీడీపీకి ఇవి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. సంప్రదాయకంగా అధికారిక రుణాలను పొందడంలో అడ్డంకులను ఎదుర్కొనే అనధికారిక సూక్ష వ్యాపారాలకు క్రెడిట్‌ను అందుబాటులో ఉంచడం క్యూఆర్‌–కోడ్‌ ఆధారిత రుణ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తిని వారి రోజువారీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందించామని తెలిపారు. ఇప్పటి వరకు 75,000 పైచిలుకు అనధికారిక సూక్ష వ్యాపారులకు రుణం సమకూర్చామని వివరించారు.
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)