అడ్మిషన్‌ తిరస్కరించిన కాలేజీకే ముఖ్య అతిథిగా..

Published on Fri, 09/06/2024 - 14:55

దేశంలోనే అత్యంత ధనవంతుడు గౌతమ్‌ అదానీ విద్యార్థిదశలో తన అడ్మిషన్‌ దరఖాస్తును తిరస్కరించిన కాలేజీలోనే ఇటీవల ఉపన్యాసం ఇచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముంబయిలోని జై హింద్‌ కాలేజీ గౌతమ్‌ అదానీను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా అదానీని పరిచయం చేసే క్రమంలో కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు విక్రమ్‌ నాంకనీ ఆసక్తికర విషయాలు తెలిపారు.

‘1977-78 సంవత్సరంలో గౌతమ్‌ అదానీ తన పదహారో ఏటా జై హింద్‌ కాలేజీలో చదివేందుకు అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికే తన సోదరుడు ఈ కాలేజీలో చదవగా తాను ఇక్కడే చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కాలేజీ తన అడ్మిషన్‌ను తిరస్కరించింది. దాంతో అదే సంవత్సరం ముంబయిలో డైమండ్‌ సార్టర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత అంచెలంచెలుగా తన వ్యాపారాన్ని విస్తరించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. అడ్మిషన్‌ తిరస్కరించిన కాలేజీలోనే ఉపన్యాసం ఇచ్చేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు’ అని విక్రమ్‌ నాంకనీ వెల్లడించారు.

కాలేజీ నుంచి వెళ్లిన అదానీ వ్యాపారంలో ఎదిగి ప్రస్తుతం 220 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.18.26 లక్షల కోట్లు) సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. ఇటీవల హురున్‌ ఇండియా ప్రకటించిన దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేశ్‌ అంబానీను వెనక్కినెట్టి మొదటి స్థానంలోకి చేరుకున్నారు.

అదానీ వ్యాపార సామ్రాజ్యం

ఎనర్జీ అండ్‌ యూటిలిటీస్‌ రంగంలో..

  • అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్

  • అదానీ పవర్ లిమిటెడ్

  • అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్

  • అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్

రవాణా అండ్‌ లాజిస్టిక్స్ రంగంలో..

  • అదానీ పోర్ట్స్ అండ్‌ సెజ్ లిమిటెడ్

  • అదానీ ఎయిర్‌పోర్ట్స్‌

సహజ వనరుల విభాగంలో..

  • అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్

ఇదీ చదవండి: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై త్వరలో కేంద్రం తీపి కబురు

ఇతర రంగాలు

  • అదానీ విల్మార్ లిమిటెడ్

  • అదానీ డిఫెన్స్ అండ్‌ ఏరోస్పేస్

  • అదానీ వాటర్

  • అదానీ రోడ్, మెట్రో అండ్‌ రైల్‌

  • అదానీ డేటా సెంటర్స్‌

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)