Breaking News

అంబానీ మరో సంచలన నిర్ణయం: జూలై 20 ముహూర్తం

Published on Sat, 07/08/2023 - 16:22

ఆసియా కుబేరుడు, రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ  మరో కీలక అడుగు వేయబోతున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో  లిస్ట్‌ంగ్‌కు  సిద్దమవుతున్నారు. మాతృ సంస్థ రిలయన్స్ గ్రూపు నుంచి విడిపోయేందుకు ఇప్పటికేఎన్‌సీఎల్‌టీ  ఆమోదం పొందింది.  

రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌ఐఎల్) కొత్త ఈక్విటీ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో పొందేందుకు అర్హులైన కంపెనీ ఈక్విటీ వాటాదారులను నిర్ణయించే ఉద్దేశ్యంతో జూలై 20ని రికార్డ్ డేట్‌గా (షేర్స్‌ ఎలాట్‌మెంట్‌) నిర్ణయించినట్లు శనివారం తెలిపింది. ఈ  స్కీం ఎఫెక్ట్‌  తేదీ జూలై 1, 2023 అని  రెగ్యులేటర్ ఫైలింగ్‌లో రిలయన్స్‌ పేర్కొంది. స్కీమ్ నిబంధనలకు అనుగుణంగా, ఆర్‌ఎస్‌ఐఎల్ ఈక్విటీ షేరును రూ. 10 ముఖ విలువతో జారీ చేస్తుంది. (HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: విలీనం తరువాత లక్షలాది కస్టమర్లకు భారీ షాక్‌!)

ఈ మార్చిలో, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌ఐఎల్ తన ఆర్థిక సేవల సంస్థను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌ఐఎల్)లుగా విడదీసి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్‌ఎస్‌ఎల్)గా పేరు మార్చాలని యోచిస్తున్నట్లు తెలిపింది. అలాగే హితేష్ కుమార్ సేథీ కొత్త సంస్థకు సీఎండీగా ఉంటారని కూడా ఆర్‌ఎస్‌ఐఎల్‌ ప్రకటించింది. (డైనమిక్‌ లేడీ నదియా: కిల్లర్‌ మూవ్‌తో రూ. 300కోట్ల-8వేల కోట్లకు)

జియో ఫైనాన్షియల్ నికర విలువ రూ. 1,50,000 కోట్లు. ఈ లిస్టింగ్‌ ద్వారా కంపెనీకి చెందిన 36 లక్షల మంది వాటాదారులకు లాభాల పంట పడనుంది. మరోవైపు గ్లోబల్ బ్రోకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ ప్రకారం, జియో ఫైనాన్షియల్ షేర్ ధర రూ. 189 ఉంటుందని అంచనా. ఈ డీమెర్జర్‌, లిస్టంగ్‌ తరువాత  జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ దేశంలో ఐదో అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరించనుంది. అంతేకాదు పేటీఎం, బజాజ్ ఫైనాన్స్‌తో  గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)