Breaking News

‘ఫోర్బ్స్‌’ కుబేరుల్లోనూ అంబానీకే పట్టం

Published on Fri, 10/13/2023 - 07:35

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. 2023 సంవత్సరానికి గాను భారత్‌లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్‌ రూపొందించిన జాబితాలో నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సంపద 92 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మరోవైపు గతేడాది అంబానీని కూడా దాటేసిన అదానీ గ్రూప్‌ చీఫ్‌ గౌతమ్‌ అదానీ ఈసారి 68 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిల్చారు.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల దెబ్బతో అదానీ గ్రూప్‌ సంస్థల షేర్లు కుదేలవడంతో ఆయన సంపద 82 బిలియన్‌ డాలర్ల మేర కరిగిపోవడం ఇందుకు కారణం. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చీఫ్‌ శివ నాడార్‌ 29.3 బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను విడగొట్టి, లిస్టింగ్‌ చేయడంతో పాటు తన ముగ్గురు సంతానానికి రిలయన్స్‌ బోర్డులో చోటు కల్పించడం ద్వారా ముకేశ్‌ అంబానీ వారసత్వ ప్రణాళికను పటిష్టంగా అమలు చేసినట్లు ఫోర్బ్స్‌ పేర్కొంది.

అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు భారత్‌ ఒక హాట్‌స్పాట్‌గా ఉంటోందని తెలిపింది. కుబేరుల సంపద మరింతగా పెరగడంతో, టాప్‌ 100 లిస్టులోకి చేరాలంటే కటాఫ్‌ మార్కు 2.3 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ఆసియా వెల్త్‌ ఎడిటర్‌ నాజ్‌నీన్‌ కర్మాలీ వివరించారు. భారత్‌లోని 100 మంది కుబేరుల మొత్తం సంపద ఈ ఏడాది 799 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

వ్యక్తి                             ర్యాంకు    సంపద (బి.డాలర్లలో) 
ముకేశ్‌ అంబానీ             1              92 
గౌతమ్‌ అదానీ               2              68
శివ నాడార్‌                    3              29.3 
సావిత్రి జిందాల్‌           4              24 
రాధాకిషన్‌ దమానీ        5             23 
సైరస్‌ పూనావాలా         6             20.7 
హిందుజా కుటుంబం    7            20 
దిలీప్‌ సంఘ్వి               8            19 
కుమార బిర్లా                  9            17.5 
షాపూర్‌ మిస్త్రీ, కుటుంబం 10    16.9 

 

తెలుగువారిలో 
మురళి దివి                     33         6.3 
పి.పి. రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 54       4.05 
‘డాక్టర్‌ రెడ్డీస్‌’ కుటుంబం 75        3 
ప్రతాప్‌ రెడ్డి                      94         2.48 
పీవీ రామ్‌ప్రసాద్‌రెడ్డి      98          2.35

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)