Breaking News

ఒక్క రూపాయీ జీతం తీసుకోని ముఖేష్‌ అంబానీ!

Published on Wed, 08/07/2024 - 22:05

దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా నాలుగో ఏడాది కూడా తన కంపెనీల నుంచి ఎలాంటి జీతం తీసుకోలేదు. కరోనా మహమ్మారి సమయం నుంచి ఆయన వేతనం తీసుకోవడం ఆపేశారు. ఆయనేకాదు తన బోర్డులోకి వచ్చిన తన వారసులు కూడా వేతనాలు తీసుకోకపోవడం గమనార్హం.

కరోనాకి ముందు వేతనం అందుకున్న ముఖేష్‌ అంబానీ.. ఉన్నత నిర్వాహక స్థానాల్లో ఉన్నవారు వేతనాల విషయంలో ఆదర్శంగా ఉండాలని, అందుకు తానే వ్యక్తిగత ఉదాహరణగా నిలిచేందుకు 2009 నుంచి 2020 ఆర్థిక సంవత్సరం వరకు తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. 2021లో కోవిడ్ మహమ్మారి కారణంగా వ్యాపారాలు ప్రభావితమైనప్పుడు అంబానీ తన జీతాన్ని పూర్తీగా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.

కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2024 ఆర్థికేడాదిలో ముఖేష్‌ అంబానీ జీతం రూపంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అలవెన్సులు, పెర్క్విసిట్‌లతో పాటు రిటైరల్ ప్రయోజనాలను కూడా పొందలేదు. 1977 నుంచి రిలయన్స్ బోర్డులో ఉన్న ముఖేష్‌ అంబానీ, 2002 జూలైలో తన తండ్రి ధీరూభాయ్‌ అంబానీ మరణించిన తర్వాత కంపెనీ ఛైర్మన్‌ అయ్యారు.

ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్‌లు గత ఏడాది అక్టోబర్‌లో ఎటువంటి జీతం లేకుండా బోర్డులో నియమితులయ్యారు. కానీ ఒక్కొక్కరు సిట్టింగ్ ఫీజుగా రూ.4 లక్షలు, కమీషన్ కింద రూ.97 లక్షలు పొందారు. బోర్డులో 2023 ఆగస్టు 28 వరకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ సిట్టింగ్‌ ఫీజు రూపంలో రూ.2 లక్షలు, కమీషన్‌ కింద  రూ.97 లక్షలు అందుకున్నారు.

ముఖేష్‌ అంబానీ కంపెనీ నుంచి ఎలాంటి వేతనం తీసుకోనప్పటికీ వ్యాపార పర్యటనల సమయంలో అయ్యే ఖర్చులన్నిటినీ కంపెనీ నుంచి చెల్లిస్తారు. అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికి కూడా కంపెనీనే ఖర్చులు భరిస్తుంది. 109 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్‌ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)