Breaking News

అంబానీ ‘రంగులు మార్చే’ లగ్జరీ కారు: వీడియో వైరల్‌

Published on Wed, 07/05/2023 - 13:54

ఆసియా కుబేరుడు, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కోట్ల రూపాయల కొత్త కారు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవల కోటి రూపాయలు పెట్టి, పెయింటింగ్‌,ఇ తర మార్పులు చేసిన  ‘రంగులు మార్చే’ లగ్జరీ కారు  రోల్స్ రాయిస్ కెమెరాకు చిక్కింది.  (టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో ఎదురుదెబ్బ!)

ఇటీవల కోటి రూపాయలకుపైగా ఖర్చుపెట్టి మరీ పెయింటింగ్‌ వేయించిన రోల్స్ రాయిస్ కల్లినన్ ఎస్‌యూవీ కెమెరాకు చిక్కింది. ఇక ఇన్‌స్టా యూజర్‌ దీన్ని పోస్ట్‌ చేశారు. ర్యాప్‌ షేడ్స్‌లైట్స్‌ మారుతున్న తీరు విశేషంగా నిలిచింది. అయితే  నిజంగా ఇది రంగులు మార్చడం కాదు. సైకెడెలిక్ ర్యాప్  వివిధ షేడ్స్ లైట్ల క్రింద వివిధ రంగులను రిప్లెక్ట్‌  చేస్తుంది.  అలా ఈ కారు రంగులు మారుతున్న భ్రమను మనకు కలిగిస్తుందన్న మాట. 

అంబానీ సొంతమైన రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర దాదాపు రూ.13.14 కోట్లు.  సాధారణంగా, రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర రూ.6.8 కోట్ల నుండి ప్రారంభం. అయితే మీడియా నివేదికల ప్రకారంకోటి రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేసే పెయింటింగ్, 21 అంగుళాల వీల్స్, ఇతర కస్టమైజేషన్ కారణంగా దీని ధర రూ.13.14 కోట్లకు పెరిగిందన్నట్టు. అంతేకాదు  దీని రిజిస్ట్రేషన్ నంబర్ '0001' కోసం రూ. 12 లక్షలు చెల్లించారట. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్‌, సరికొత్త ప్లాన్‌ కూడా)

కాగా అంబానీ లగ్జరీ నివాసం ముంబైలోని రూ. 15,000 యాంటిలియా, రూ. 850 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌తో పాటు,  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన  కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్, బెంట్లీ, ల్యాండ్ రోవర్, లంబోర్ఘిని ఫెరారీ  లాంటి టాప్‌   కార్లు అంబానీ కుటుంబం  సొంతం.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)