ముద్ర లోన్ లిమిట్ పెంపు: రూ.10 లక్షల నుంచి..

Published on Fri, 10/25/2024 - 14:32

2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించినట్లుగా.. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఏవై) కింద ముద్ర లోన్ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

నిధులు లేని వారికి నిధులు సమకూర్చే ముద్రా పథకం.. వారి వృద్ధి, విస్తరణను మరింత సులభతరం చేయడానికి లోన్ పరిమితిని రెట్టింపు చేయడం జరిగింది. ఇది రాబోయే వ్యవస్థాపకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బలమైన వ్యవస్థాపక పర్యావరణాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

'తరుణ్ కేటగిరీ' కింద గతంలో రుణాలను పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు ముద్ర లోన్ పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. అంటే వీరు ముద్ర లోన్ కింద రూ. 20 లక్షల లోన్ తీసుకోవచ్చు. అంతే కాకుండా రూ. 20 లక్షల వరకు ఉన్న పీఎంఏవై లోన్ హామీ కవరేజ్.. మైక్రో యూనిట్ల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ (CGFMU) కింద అందించనున్నారు.

ప్రధాన్ మంత్రి ముద్ర యోజన
ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY) అనేది కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం 2015 ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ రుణాలను పీఎంఏవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించారు. ఈ లోన్స్ మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లు అందిస్తారు. అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో-ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్‌లు ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా లోన్స్ మంజూరు చేస్తాయి.

పీఎంఏవై కింద లోన్స్ అనేవి పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం మొదలైన వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాలకు మాత్రమే కాకుండా తయారీ, వ్యాపారం వంటి వాటికి కూడా అందిస్తారు. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఈ లోన్స్ చాలా ఉపయోగపడతాయి.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)