Breaking News

ముద్రా రుణాల పరిమితి రెట్టింపు చేయాలి

Published on Fri, 07/19/2024 - 04:34

రాబోయే బడ్జెట్‌లో ముద్రా యోజన కింద ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేయాలని, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలని చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) కేంద్రాన్ని కోరుతున్నాయి. అలాగే అన్‌సెక్యూర్డ్‌ రుణాలకు రుణ హామీ కవరేజీని రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచాలని ఆశిస్తున్నాయి. అటు అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి తగు మద్దతు కూడా కలి్పంచాలని కోరుకుంటున్నాయి.

 ఎంఎస్‌ఎంఈల వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తన ఎజెండాను కొనసాగించే అవకాశం ఉందని బడ్జెట్‌పై నెలకొన్న అంచనాలను అర్క ఫిన్‌క్యాప్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ నవీన్‌ సైనీ తెలిపారు. ముద్రా రుణాల పరిమితిని పెంచడం తదితర అంశాలతో ఎంఎస్‌ఎంఈలకు మరిన్ని ఆర్థిక వనరులు అందుబాటులోకి రాగలవని, వాటి ఎదుగుదలతో పాటు ఎకానమీ వృద్ధికి కూడా దోహదపడగలవని వివరించారు.  

రియల్టీ ఆశలు.. 
బడ్జెట్‌పై రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చాలా ఆశలు ఉన్నట్లు క్రిసుమి కార్పొరేషన్‌ ఎండీ మోహిత్‌ జైన్‌ తెలిపారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరడంలో వేతన జీవులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో గృహ రుణాలపై చెల్లించే అసలు, వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 

గత కొన్నాళ్లుగా ప్రాపరీ్టల విలువ భారీగా పెరిగినందున గృహ రుణ వడ్డీపై పన్ను రిబేటును ప్రస్తుతమున్న రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని పేర్కొన్నారు. మరోవైపు స్టార్టప్‌ల కోసం పన్నుల విధానాన్ని సరళతరం చేస్తే అంకుర సంస్థలకు ఊరట లభించగలదని సీఆర్‌ఐబీ సహ వ్యవస్థాపకుడు సన్నీ గర్గ్‌ తెలిపారు. ఏంజెల్‌ ట్యాక్స్‌ను తొలగించడం లేదా క్రమబదీ్ధకరించడమో చేస్తే దేశీయంగా నిధుల లభ్యత మెరుగుపడుతుందని, ప్రారంభ దశలోని అంకుర సంస్థలకు ఫండింగ్‌పరమైన వెసులుబాటు లభించగలదని పేర్కొన్నారు.  

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)