Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
సినిమా ఆలస్యం.. హైదరాబాద్ పీవీఆర్ మల్టీప్లెక్స్‌కు జరిమానా!
Published on Tue, 09/29/2026 - 13:40
సినిమా చూసి కాస్త రిలాక్స్ అవుదామని థియేటర్‌కు వెళ్తే.. స్క్రీన్ మీద నిమిషాల తరబడి ప్రకటనలు వేస్తూ మీ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని ఎప్పుడైనా విసుగు చెందారా? ‘అందరూ భరిస్తున్నారు కదా, మనమెందుకు గొడవ పడటం’ అని చాలామంది ఊరుకుంటారు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఒక న్యాయవాది మాత్రం ఆ ఉదాసీనతను పక్కనపెట్టి చట్టపరంగా పోరాడారు!
రాత్రి 10.35 గంటలకు ప్రారంభం కావాల్సిన చిత్రం కోసం టికెట్ బుక్ చేసుకుని వెళ్తే పీవీఆర్ మల్టీప్లెక్స్ యాజమాన్యం ఏకంగా 22 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలే ప్రదర్శించింది. దీంతో సినిమా ఆలస్యమై లేట్ నైట్ ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది. ఈ ఉల్లంఘనపై ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. సంస్థకు రూ.75,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. ప్రేక్షకుల సమయాన్ని తేలిగ్గా తీసుకునే థియేటర్ యాజమాన్యాలకు చెక్ పెట్టిన ఈ ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం.
కేసు వివరాలు
హైదరాబాద్‌కు చెందిన ఒక న్యాయవాది 2025 జూన్ 20న రాత్రి 10.35 గంటల షోకు ధనుష్, నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమా చూడటానికి పీవీఆర్ థియేటర్‌లో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. రాత్రి 10.30 గంటలకే థియేటర్‌కు చేరుకుని సీట్లలో కూర్చున్నప్పటికీ సినిమా మాత్రం నిర్ణీత సమయానికి ప్రారంభం కాలేదు. వాణిజ్య ప్రకటనలు, ఇతర ట్రైలర్లు ప్రదర్శించడంతో రాత్రి 10.52 గంటలకు (దాదాపు 22 నిమిషాలు ఆలస్యంగా) సినిమా మొదలైంది. దీనివల్ల షో పూర్తయి ఇంటికి చేరేసరికి రాత్రి 2 గంటలకు బదులు 3 గంటలైందని, ఇది తన విశ్రాంతిని, వ్యక్తిగత పనులను తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొంటూ ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
ప్రజా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం సామాజిక అవగాహన ప్రకటనలు గరిష్టంగా రెండు నిమిషాలు మాత్రమే ఉండాలి. నియమాలను ఉల్లంఘించి యాడ్స్ వేయడం అనుచిత వ్యాపార ధోరణి కిందకు వస్తుందని ఫిర్యాదుదారు వాదించారు. కాగా, ప్రకటనలు వేయడం తమ వ్యాపార హక్కుఅని పీవీఆర్ సంస్థ సమర్థించుకున్నప్పటికీ కమిషన్ ఆ వాదనను తోసిపుచ్చింది.
వినియోగదారుల కమిషన్ తీర్పు
కమిషన్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి సంస్థకు ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం.. ఫిర్యాదుదారునికి ఎదురైన మానసిక ఆందోళన, అసౌకర్యానికి గాను రూ.20,000 పరిహారం చెల్లించాలి. కోర్టు ఖర్చుల కింద రూ.5,000 అందజేయాలి. నిబంధనల ఉల్లంఘనకు గాను రూ.50,000 జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి జరిమానా రూపంలో జమ చేయాలి. భవిష్యత్తులో ఈ తరహా అనుచిత వ్యాపార పద్ధతులను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది. సినిమా థియేటర్లలో నిర్ణీత సమయాన్ని పాటించకుండా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే యాజమాన్యాలకు ఈ తీర్పు హెచ్చరికగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు దిగివచ్చిన వేళ.. ఒక్కరోజే ఇలా..
Tags : 1