Breaking News

మోటోరోలా తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌: ధర ఎంతంటే?

Published on Thu, 05/14/2026 - 16:23

మోటరోలా భారత్‌లో తన తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘మోటరోలా రేజర్‌ ఫోల్డ్‌’ను అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన కెమెరా సెటప్, ఏఐ (మోటో ఏఐ) ఫీచర్లు, ఫోల్డబుల్స్‌లోనే అతిపెద్ద బ్యాటరీతో ఈ ఫోన్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఫోల్డబుల్‌ ఫోన్లలోనే అత్యంత శక్తివంతమైన 6,000ఎంఏహెచ్‌ సిలికాన్‌-కార్బన్‌ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇది 80డబ్ల్యూ టర్బో పవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్‌: ఇందులో 6.6 అంగుళాల ఎక్స్‌టర్నల్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉండగా, అన్‌ఫోల్డ్‌ చేసినప్పుడు 8.1 అంగుళాల భారీ 2కే మెయిన్‌ డిస్‌ప్లేగా మారుతుంది. ఇది 6,200 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్, ఆండ్రాయిడ్‌ 16 వెర్షన్‌తో వస్తుంది. దీనికి ఏకంగా 7 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్‌ ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి.

కెమెరా విశేషాలు: ఫోటోగ్రఫీ కోసం ఇందులో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్‌ 50 మెగాఫిక్సెల్‌(ఎంపీ) ఎంపీ ప్రో–గ్రేడ్‌ ఫోల్డబుల్‌ కెమెరా సిస్టమ్‌ను అందించారు. 50ఎంపీ ప్రధాన కెమెరా (సోనీ లైటియా 828) 8కే డాల్బీ విజన్‌ రికార్డింగ్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. వీటితో పాటు 50ఎంపీ పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ (3ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్, 100ఎక్స్‌ సూపర్‌ జూమ్‌ ప్రో), 122 డిగ్రీల ఫీల్డ్‌ ఆఫ్‌ వ్యూ కలిగిన 50ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరాలు ఉన్నాయి.

ఫిఫా వరల్డ్‌కప్‌ 26 స్పెషల్‌ ఎడిషన్‌: ఫుట్‌బాల్‌ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫిఫా వరల్డ్‌కప్‌ 26 ఎడిషన్‌ను మోటరోలా పరిచయం చేసింది. ఈ వేరియంట్‌ వెనుక భాగంలో 24 క్యారెట్ల బంగారు పూతతో కూడిన అధికారిక ఫిఫా లోగో ఉంటుంది. ఇది ప్రత్యేకమైన ఫిఫా థీమ్స్, వాల్‌పేపర్లతో వస్తుంది.

ధర, డిస్కౌంట్లు: 12జీబీ + 256జీబీ వేరియంట్‌ రూ. 1,49,999గా, 16 జీబీ + 512 జీబీ ధర రూ.1,59,999గా ఉన్నాయి. ఫిపా వరల్డ్‌కప్‌ 26 ఎడిషన్‌ రూ. 1,69,999 గా నిర్ణయించారు. లాంచింగ్‌ ఆఫర్ల కింద యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది.

ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డులపై 18 నెలల వరకు నో–కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కల్పించారు. జూన్‌ 20లోపు కొనుగోలు చేసిన వారికి ఒకసారి ఉచిత స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ (ఒక ఏడాది వరకు చెల్లుబాటు) లభిస్తుంది ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలాడాట్‌ సైట్లలో, ప్రముఖ రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. మే 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

మోటో బడ్స్‌2 ప్లస్‌: వినియోగదారులకు మెరుగైన ఆడియో అనుభవం కోసం ‘మోటో బడ్స్‌ 2 ప్లస్‌’ను కూడా విడుదల చేసింది. ఇవి ‘సౌండ్‌ బై బోస్‌’ టెక్నాలజీతో రూపొందాయి. 11ఎంఎం డైనమిక్‌ డ్రైవర్లు, సెగ్మెంట్‌లోనే ఉత్తమమైన 55డీబీ డైనమిక్‌ ఏఎన్‌సీ (నాయిస్‌ క్యాన్సిలేషన్‌), బ్లూటూత్‌ 6.0 సపోర్ట్‌ ఉన్నాయి. ఇవి కేస్‌తో కలిపి 40 గంటల వరకు ప్లేటైమ్‌ ఇస్తాయి. దీని ధర రూ. 5,999 కాగా, రూ. 1,000 బ్యాంక్‌ డిస్కౌంట్‌తో రూ. 4,999 కే లభిస్తాయి.

Videos

జై జగన్ జై జగన్!! దద్దరిల్లిన YSRCP ఆఫీస్

లోకేష్ జల్సాలు..స్పెషల్ ఫ్లైట్లో పుట్టపర్తికి..భారీ కాన్వాయ్ లో చక్కర్లు

2 వాహనాలతో మోదీ కాన్వాయ్ 8 వాహనాలతో లోకేష్ కాన్వాయ్

YSRCPలో చేరిన తరువాత మోపిదేవి శ్రీనివాసరావు ఫస్ట్ రియాక్షన్

తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు ముందుగానే రుతుపవనాలు

మోపిదేవికి జగన్ హామీ..

జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు

రేపు పోలీసుల ముందుకు బండి.. హైకోర్టులో వాదనలు

బండి భగీరథ్ కు బిగ్ షాక్.. హైకోర్టు సంచలన కామెంట్స్

హైకోర్టు సంచలన కామెంట్స్.. బండి భగీరథ్ కు బిగ్ షాక్

Photos

+5

ఫారిన్ వెకేషన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ.. (ఫోటోలు)

+5

కేన్స్ వీధుల్లో మెగా డాటర్ నిహారిక సందడి.. (ఫోటోలు)

+5

పొలిటికల్‌ స్టైల్‌ షో.. ఈ అదిరే లుక్స్‌ చూశారా?..

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసిన నటి ఊర్వశీ రౌతేలా (ఫొటోలు)

+5

చిత్తూరు గంగజాతర... కనులపండువగా అమ్మవారి దివ్యరూపం (ఫొటోలు)

+5

‘దూరదర్శని’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)