Breaking News

ఏఎస్‌సీఐ సంచలన రిపోర్ట్ - డిజిటల్‌ మీడియాలోనే ఎక్కువగా అవే!

Published on Thu, 11/23/2023 - 06:59

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) అభ్యంతరకర ప్రకటనలు అత్యధికంగా డిజిటల్‌ మీడియాలోనే దర్శనమిచ్చాయని అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ (ఏఎస్‌సీఐ) ఒక నివేదికలో తెలిపింది. అయిదింట నాలుగొంతుల అభ్యంతర యాడ్‌లు డిజిటల్‌ మీడియా నుంచే ఉన్నట్లు వివరించింది. 

గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే 2023–24 ప్రథమార్ధంలో ఏఎస్‌సీఐ 27 శాతం అధికంగా 3,501 ప్రకటనలను సమీక్షించింది. సమీక్షాకాలంలో ఫిర్యాదుల సంఖ్య 34 శాతం పెరిగి 4,491కి చేరింది. ఏఎస్‌సీఐ ప్రాసెస్‌ చేసిన ప్రకటనల్లో ఇన్‌ఫ్లుయెన్సర్ల కేసులు 22 శాతం ఉన్నాయి. ఎనిమిది ఉల్లంఘనలతో బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 

రంగాల వారీగా చూస్తే .. అత్యధికంగా హెల్త్‌కేర్‌లో, ఆ తర్వాత సంప్రదాయ విద్య, వ్యక్తిగత సంరక్షణ, గేమింగ్‌ విభాగాల్లో ఉల్లంఘనలు జరిగాయి. నాలుగింట మూడొంతుల ఫిర్యాదులను ఏఎస్‌సీఐ సుమోటోగా చేపట్టగా, వినియోగదారుల నుంచి వచ్చినవి 21 శాతం ఉన్నాయి. ఉల్లంఘనల్లో వాటాలు చూస్తే డిజిటల్‌ మీడియా 79 శాతం, ప్రింట్‌ మాధ్యమం 17 శాతం, టీవీ మాధ్యమం 3 శాతంగా ఉన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)