Breaking News

42 గంటలే ప్రయాణం.. మూడేళ్లకు స్టేషన్ చేరింది

Published on Tue, 12/10/2024 - 15:11

రైలు ఆలస్యంగా రావడం సర్వసాధారణమే. ఆలస్యం అంటే ఒక గంట, రెండు గంటలు.. మహా అయితే ఒక రోజు అనుకుందాం. కానీ 42 గంటల్లో గమ్యాన్ని చేరాల్సిన రైలు.. తన గమ్యాన్ని చేరుకోవడానికి 3 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి వెళుతున్న గూడ్స్ రైలు 42 గంటల్లో గమ్యాన్ని చేరాల్సి ఉంది. 2014లో బస్తీలోని వ్యాపారవేత్త 'రామచంద్ర గుప్తా' తన వ్యాపారం కోసం విశాఖపట్నంలోని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ నుంచి సుమారు రూ.14 లక్షల విలువైన డైమోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) కోసం ఆర్డర్ ఇచ్చాడు.

నవంబర్ 10, 2014న, షెడ్యూల్ ప్రకారం బయలుదేరిన గూడ్స్ రైలులో 1,316 బస్తాల డీఏపీ లోడ్ చేశారు. కానీ చేరుకోవాల్సిన సమయానికి ట్రైన్ చేరలేదు. రామచంద్ర గుప్తా అనేక ఫిర్యాదుల తరువాత, రైలు మార్గమధ్యంలో అదృశ్యమైనట్లు అధికారులు కనుగొన్నారు.

ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్‌ గురించి తెలుసా..?

2014 నవంబర్ 10న బయలుదేరిన గూడ్స్ ట్రైన్.. జూలై 25, 2018న బస్తీ స్టేషన్‌కు చేరింది. కానీ రామచంద్ర గుప్తా ఆర్డర్ చేసిన డీఏపీ మొత్తం పాడైపోయింది. అయితే ఇండియన్ రైల్వే చరిత్రలోనే ఇంత ఆలస్యంగా గమ్యాన్ని చేరుకున్న ట్రైన్ ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకు కూడా ఏ ట్రైన్ ఇంత ఆలస్యంగా ప్రయాణించలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)