Breaking News

2003-07 నాటి వృద్ధిరేటు దిశగా భారత జీడీపీ

Published on Mon, 03/18/2024 - 12:24

దేశ ఎకానమీ వృద్ధి రేటుపై మోర్గాన్‌స్టాన్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ఎకానమీ 2003–2007 కాలంలో ఎలా అయితే వృద్ధి చెందిందో ప్రస్తుత పరిస్థితుల్లోనూ అదేమాదిరి వృద్ధి కనబరుస్తోందని మోర్గాన్ స్టాన్లీ నివేదికలో తెలిపింది. 

భారత జీడీపీ 2003-07 కాలంలో ఏడాదికి సగటున 8.6 శాతం చొప్పున వృద్ధి కనబరిచింది. ప్రస్తుత పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని నిదేదిక ద్వారా తెలిసింది. భారీగా పెట్టుబడులు వస్తుండడంతో దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. కానీ పెట్టుబడులు పెరగడంతో  ఎకానమీ వృద్ధి చెందుతోందని  ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. వినియోగం తగ్గినా, దేశంలోకి వస్తున్న పెట్టుబడులు జీడీపీ గ్రోత్‌‌‌‌‌‌‌‌ను ముందుండి నడుపుతున్నాయని తెలిపింది.

నివేదిక ప్రకారం.. ప్రభుత్వం చేసే మూలధన వ్యయం తగ్గినప్పటికీ ప్రైవేట్ కంపెనీలు చేసే క్యాపెక్స్ పుంజుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గినా, పట్టణాల్లో వినియోగం ఊపందుకుంది. గ్లోబల్ ఎగుమతుల్లో ఇండియా వాటా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది. జీడీపీ వృద్ధి 2003–2007 సమయంలో 27 శాతం నుంచి 39 శాతానికి చేరుకుంది. ఇదే గరిష్ట వృద్ధిగా నమోదైంది.

ఇదీ చదవండి: ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

2011–21 మధ్య  పెట్టుబడులు తగ్గినా ప్రస్తుతం జీడీపీ 34 శాతం దగ్గర ఉందని వివరించింది. భవిష్యత్తులో ఇది 36 శాతానికి చేరుతుందని అంచనా. 2003–2007 లో ద్రవ్యోల్బణం‌ 4.8 శాతంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదైనట్లు నివేదిక తెలిపింది.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)