Breaking News

సంపాదించటం అనేది ఒక స్వభావం

Published on Fri, 09/04/2026 - 14:42

డబ్బు సంపాదనను కేవలం అంకెలతో కొలవలేమనీ, అది మన ప్రవర్తన, భావోద్వేగాలు, నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందనీ మోర్గాన్‌ హౌసెల్‌ అంటు న్నారు. జీవితంలో నిజమైన ఆర్థిక విజయాన్ని పొందడమే కాకుండా, మనశ్శాంతితో కూడిన తృప్తికరమైన జీవితాన్ని ఎలా గడపాలో చెబుతున్నారు.
 

కూడబెట్టటం... కాపాడుకోవటం
‘‘ఆర్థిక విజయం సాధించడానికి మీరు ఎంత తెలివైన వారు, చదువులో ఎంత ప్రతిభ చూపారు లేదా ఏ కాలేజీలో చదివారు అనే వాటితో పెద్దగా సంబంధం ఉండదు. ఉదాహరణకు, గ్రేస్‌ గ్రోనర్‌ అనే మహిళ దశాబ్దాల పాటు ఒక సాధారణ కార్యదర్శిగా పని చేశారు. ఆమె చాలా మామూలు జీవితం గడుపుతూ, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టేవారు. ఆమె చనిపోయే నాటికి కోట్లాది రూపాయల ఆస్తి జమయింది! దీనికి భిన్నంగా, లక్షల రూపాయలు సంపాదించే వాల్‌ స్ట్రీట్‌ ఎగ్జిక్యూటివ్‌లు లేదా గొప్ప వ్యాపారవేత్తలను చూడండి. అతిగా అప్పులు చేసి, రిస్క్‌ తీసుకోవడం వల్ల వారు తమ సంపదనంతా పోగొట్టుకున్నారు. శ్రీమంతులు అవటానికి కావాల్సిన నైపుణ్యాలు వేరు, శ్రీమంతులుగా కొనసాగడానికి కావాల్సిన స్వభావాలు వేరు.

శ్రీమంతులు రెండు రకాలు
రాక్‌ఫెల్లర్, వాండర్‌బిల్ట్‌ కుటుంబాల మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసాన్ని చూడండి. కార్నెలియస్‌ వాండర్‌బిల్ట్‌ మానవ చరిత్రలోనే అతిపెద్ద సంపదలలో ఒక దానిని సృష్టించాడు. కానీ కొద్ది తరాల్లోనే అతని వారసులు విలాసవంతమైన భవనాలు, అద్భుతమైన పార్టీలతో ఆ డబ్బునంతా నీళ్లలా ఖర్చు చేశారు. మరోవైపు, రాక్‌ఫెల్లర్‌ కుటుంబం అలా చేయలేదు. ఒక సరైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. తమ పిల్లలకు స్థాయికి మించి ఖర్చు చేయకుండా నిరాడంబరంగా బతకడం నేర్పించారు. మీ సమయాన్ని, స్వేచ్ఛను తిరిగి పొందడానికి డబ్బును ఒక సాధనంగా వాడటం ఆపి, మిమ్మల్ని అస్సలు పట్టించుకోని వారిని ఆకట్టుకోవటం కోసం ఒక ప్రదర్శనగా మార్చిన మరుక్షణమే తరతరాల సంపద నాశనం అవటం ప్రారంభమౌతుంది. 

చిన్నప్పటి దుర్భర జీవితం
మీ చిన్నతనంలో చూసిన పరిస్థితులే మీ జీవితాంతం మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి స్థోమతకు మించిన ఖరీదైన కారు, పెద్ద ఇల్లు లేదా అవసరం లేకపోయినా బ్రాండెడ్‌ వస్తు వులు కొనడం చూసినప్పుడు, వారు ఏదో ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటున్నారని అనుకోకండి. చాలా సందర్భాల్లో, తమ చిన్నతనంలో అనుభవించిన పేదరికం, అభద్రతాభావం లేదా అవమానాలను మర్చిపోవడానికి వారు అలా చేస్తుంటారు. కానీ అసలు సమస్య ఏంటంటే, వస్తువులను కొని మనసులోని పాత గాయాలను మాన్పించుకోవాలని చూడటం ముగింపు లేని, తీర్చలేని ఒక పెద్ద అప్పు లాంటిది.

శాశ్వత తృప్తి... తాత్కాలిక సంతోషం 
సంతోషం అనేది కొద్దిసేపు మాత్రమే ఉండే ఒక తాత్కా లిక భావోద్వేగం. ఉదాహరణకు, మీరు కొత్త కారు కొన్నప్పుడు లేదా వ్యాపారంలో ఒక గొప్ప విజయాన్ని సాధించినప్పుడు కలిగే క్షణికమైన ఆనందం అది. కానీ తృప్తి అనేది శాశ్వతమైన మనశ్శాంతి. ‘నాకు ఉన్నది చాలు’ అనే భావనతో ఉండటమే తృప్తి. మీ ఫలితాలతో (సంపాదనతో) పాటే మీ ఆశలు కూడా పెరుగుతూ ఉంటే, మీరు జీవితంలో ఎప్పటికీ శ్రీమంతులుగా అనుభూతి చెందలేరు. మీ ఆశయాలకు ఒక సరిహద్దు అంటూ లేకపోతే, మీ జీవితమంతా ఒక ట్రెడ్‌మిల్‌ మీద పరిగెత్తినట్లే ఉంటుంది. ఒక గమ్యాన్ని చేరుకోవడం అనేది విశ్రాంతిని ఇవ్వకపోగా, తర్వాతి పరుగు పందెం కోసం మరింత ఒత్తిడితో కూడిన ప్రారంభ స్థానంగా మారుతుంది. -

- ఎడిటోరియల్‌ టీమ్‌

పాడ్‌కాస్ట్‌: ద టెట్ర్‌ పాడ్‌కాస్ట్‌

అతిథి: మోర్గాన్‌ హౌసెల్‌
‘సైకాలజీ ఆఫ్‌ మనీ’ రచయిత
హోస్ట్‌:ఫౌండర్,
టెట్ర్‌ కాలేజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ వ్యూ పాయింట్‌ 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)