Breaking News

రూ. 2 వేల కోట్ల ఐపీవోకు మోర్‌ రిటైల్‌

Published on Tue, 05/13/2025 - 05:55

కోల్‌కతా: సూపర్‌మార్కెట్‌ చెయిన్‌ మోర్‌ రిటైల్‌ .. ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ నిధులను వినియోగించుకోనుంది. కంపెనీ ఎండీ వినోద్‌ నంబియార్‌ ఈ విషయాలు తెలిపారు. వేల్యుయేషన్, మార్కెట్‌ పరిస్థితులు బట్టి వచ్చే 12–18 నెలల్లో ఐపీవోకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత ప్రమోటర్లు సుమారు 10 శాతం వాటా విక్రయించవచ్చని పేర్కొన్నారు.

 2030 నాటికి స్టోర్ల సంఖ్యను 3,000కు పెంచుకునేందుకు, సంస్థను రుణరహితంగా మార్చుకునేందుకు ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను ఉపయోగించుకోనున్నట్లు నంబియార్‌ చెప్పారు. గత 120 రోజుల్లో ఫ్యామిలీ ఆఫీసుల నుంచి సంస్థ రూ. 150 కోట్లు సమీకరించినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం కంపెనీకి సుమారు రూ. 500 కోట్ల రుణభారం ఉంది. సమరా క్యాపిటల్, అమెజాన్‌ సంస్థలు మోర్‌ రిటైల్‌కు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నాయి. కంపెనీ కొనుగోలు కోసం రూ. 4,300 కోట్లు వెచి్చంచడంతో పాటు గత అయిదేళ్లలో వ్యాపార విస్తరణకు రెండు సంస్థలు రూ. 900 కోట్ల పైగా ఇన్వెస్ట్‌ చేశాయి.  
 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)