Breaking News

భవిష్యత్తులో పాలసీ రేట్ల కోతకు మరింత చాన్స్‌: క్రిసిల్‌ 

Published on Mon, 10/06/2025 - 05:44

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించిన రిజర్వ్‌ బ్యాంక్, భవిష్యత్తులో పాలసీ రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశాలను తెరిచి ఉంచిందని క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ ఒక నివేదికలో తెలిపింది. అమెరికా టారిఫ్‌లపరమైన అనిశి్చతుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ద్వితీయార్థంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తిరోగమించే రిస్కులు ఉన్నట్లు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కూడా పేర్కొందని గుర్తు చేసింది. అయితే, ఇటీవల జీఎస్‌టీ రేట్లను క్రమబదీ్ధకరించడం వల్ల టారిఫ్‌లపరమైన ప్రతికూల ప్రభావం కొంత తగ్గొచ్చని క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ తెలిపింది.

 కారి్మక శక్తి అధికంగా ఉండే నిర్దిష్ట రంగాలపై టారిఫ్‌ల ఎఫెక్ట్‌ గణనీయంగా ఉంటుందని, వాటికి పాలసీపరమైన మద్దతును అందించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణంపరమైన ఆందోళన కొంత తగ్గే అవకాశం ఉందని, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల తగ్గింపు ప్రభావంతో ఆర్‌బీఐ కూడా పాలసీ రేట్లను తగ్గించడానికి కాస్త ఆస్కారం ఉంటుందని వివరించింది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను 100 బేసిస్‌ పాయింట్లు (1%) తగ్గించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున, ఎంపీసీ సిఫార్సుల మేరకు, పాలసీ రేట్లను ఆర్‌బీఐ ఫిబ్రవరిలో 25 బేసిస్‌ పాయింట్లు, ఏప్రిల్‌లో మరో 25 బేసిస్‌ పాయింట్లు, జూన్‌లో 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది ప్రస్తుతం 5.5 శాతానికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిటైల్‌ ద్రవ్యోల్బణం, రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించుకున్న 4 శాతం లోపే కొనసాగుతోంది. 
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)