Breaking News

5.5 శాతం నుంచి 6.7 శాతానికి అప్‌

Published on Sat, 09/02/2023 - 06:13

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2023 క్యాలెండర్‌ ఇయర్‌ వృద్ది రేటు 5.5 శాతం అంచనాలను రేటింగ్‌ దిగ్గజ సంస్థ– మూడీస్‌  భారీగా 6.7 శాతానికి పెంచింది. ఆర్థిక క్రియాశీలత గణనీయంగా మెరుగుపడ్డం దీనికి కారణమని తన తాజా అంతర్జాతీయ స్థూల ఆర్థిక అవుట్‌లుక్‌ (ఆగస్టు అప్‌డేట్‌)లో తెలిపింది. కాగా 2023 హై బేస్‌ నేపథ్యంలో 2024లో వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది.

  పటిష్ట సేవల రంగం, మూలధన వ్యయాలు ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో భారత్‌ వృద్ధి రేటు 7.8 శాతం పెరుగుదలకు కారణంగా పేర్కొంది. 2023 ద్వితీయార్థంలో, 2024 ప్రారంభంలో  ఎల్‌నినో పరిస్థితులు బలంగా ఉంటే వ్యవసాయ వస్తువుల ధరలు పెరగవచ్చని మూడీస్‌ అభిప్రాయపడింది. దేశీయ డిమాండ్‌ పటిష్టంగా ఉంటుందని, ద్రవ్యోల్బణం దేశంలో తట్టుకునే రీతిలోనే ఉండే అవకాశం ఉందని అంచనావేసిన మూడీస్, ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాత) రేట్ల పెంపు ఉండకపోవచ్చని అంచనా వేసింది.  

జీ20 వృద్ధి తీరు ఇది...
జీ–20 దేశాల వృద్ధి 2023లో 2.5 శాతంగా ఉండవచ్చని, 2024లో 2.1 శాతానికి తగ్గవచ్చని అభిప్రాయపడింది. 2022లో ఈ రేటు 2.7 శాతం. 2024 చైనా వృద్ధి రేటును 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించడం గమనార్హం. భారత్‌కు మూడీస్‌ అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ ‘బీఏఏ3’ సావరిన్‌ రేటింగ్‌ను అందిస్తోంది. 2023–24లో వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనావేస్తోంది. 2022–23 7.2 శాతం కన్నా ఇది భారీ తగ్గుదల కావడం గమనార్హం.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)