Breaking News

భారత్‌ వృద్ధికి ‘రిస్క్‌’.. అంచనాలకు మూడీస్‌ కోత

Published on Mon, 04/06/2026 - 09:08

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో భారత్‌ వృద్ధి అంచనాలకు మూడీస్‌ కోత విధించింది. గతంలో 6.8 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందన్న అంచనాలను 6 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పశ్చిమాసియా యద్ధ సంక్షోభంతోపాటు.. ఇప్పటి వరకు నియంత్రణలో ఉన్న ద్రవ్యోల్బణం పెరిగిపోయే రిస్క్‌తో వృద్ధి మోస్తరు స్థాయికి పరిమితం అవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్‌పీజీ రవాణాకు ఆటంకాలు మరింత కాలం పాటు గృహాలకు సరఫరా కొరతకు దారితీస్తుందని.. అధిక ఇంధన రవాణా ఖర్చులు ఆహార ద్రవ్యోల్బణానికి కారణమవుతాయని హెచ్చరించింది. భారత్‌ చమురు, గ్యాస్‌ సరఫరాకు హర్మూజ్‌ జలసంధి కీలకంగా ఉండడం తెలిసిందే. 2026–27లో ద్రవ్యోల్బణం 4.8 శాతం స్థాయిలో ఉండొచ్చని, 2025–26లో ఉన్న సగటు 2.4 శాతంతో పోల్చితే రెట్టింపు అవుతుందని మూడిస్‌ పేర్కొంది.

వృద్ధికి అవరోధాలు, ద్రవ్యోల్బణం రిస్క్‌ల నేపథ్యంలో పాలసీ రేట్లు స్థిరంగా లేదంటే క్రమంగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఎంత కాలం పాటు పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతుంది? ఇంధనం, ఆహారంపై దాని ప్రభావంపైనే ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది. పెరిగిపోయిన చమురు, ఎరువుల ధరలు లకి‡్ష్యత సబ్సిడీలు మరింత పెరిగేలా చేస్తాయని.. దీంతోపాటు ఆదాయం కూడా తగ్గిపోతుందని పేర్కొంది. వినియోగదారులపై ప్రభావం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించడం తెలిసిందే.  

స్థిరంగానే ఎగుమతులు
వస్తు, సేవల ఎగుమతులు స్థిరంగానే ఉంటాయని మూడిస్‌ అంచనా వేసింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా  చమురు, ఎరువుల సరఫరాకు మార్గాలు గుర్తిస్తున్నందున దిగుమతుల వ్యయాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్థిక సహకార, అభివృద్ది సమాఖ్య (ఓఈసీడీ) సైతం భారత్‌ జీడీపీ 2026–27లో 6.1 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేయగా, ఈవై ఒక శాతం వరకు వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. దేశీ రేటింగ్‌ సంస్థ ఇక్రా 2026–27లో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

Videos

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొట్టిన ఇన్నోవా

రంగులు మార్చి గృహ ప్రవేశాలు చంద్రబాబు ఖాతాలోకి టిడ్కో ఇళ్లు

జగన్ పెట్టిన "GUN" అందుకే బాబు గుండెల్లో దడ...

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అసెంబ్లీలోకి దూసుకెళ్లిన కారు, స్పీకర్ కారుపై ఇంక్ చల్లి పారిపోయిన దుండగులు

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)