Breaking News

ఎన్‌పీఎస్‌ నుంచి నెలవారీ ఆదాయం

Published on Mon, 06/19/2023 - 08:12

న్యూఢిల్లీ: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) కింద క్రమం తప్పకుండా ఉపసంహరణ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి తీసుకురానున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దీపక్‌ మహంతి తెలిపారు. దీంతో 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్‌ ఖాతాదారులు అప్పటి వరకు సమకూరిన నిధి నుంచి కావాల్సినంతే ఉపసంహరించుకోవచ్చని పేర్కొన్నారు. ‘‘ఈ ప్రతిపాదన పురోగతి దశలో ఉంది. దాదాపు వచ్చే త్రైమాసికం చివరి నాటికి ఈ పథకంతో ముందుకు వస్తాం’’అని మహంతి చెప్పారు.

ప్రస్తుతం ఎన్‌పీఎస్‌ పథకంలో 60 ఏళ్లు నిండిన వారు అప్పటి వరకు సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకుని, మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్‌ తీసుకోవాలనే నిబంధన అమల్లో ఉంది. అంతేకానీ, నెలవారీ ఇంత చొప్పున తీసుకునే అవకాశం లేదు. సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ ను అమల్లోకి తీసుకొస్తే అప్పుడు పింఛనుదారులు నెలవారీ లేదా మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికొకసారి.. వీటిల్లో తమకు అనువైన ఆప్షన్‌ ఎంపిక చేసుకుని, క్రమం తప్పకుండా ఆదాయం పొందొచ్చు. ఇలా 75 ఏళ్లు వచ్చే వరకు తీసుకోవడానికి పీఎఫ్‌ఆర్‌డీఏ అవకాశం కల్పించనుంది.

‘‘నా నిధిపై మంచి రాబడులు వస్తున్నప్పుడు ఆ మొత్తాన్ని ఎందుకు కొనసాగించకూడదు. ఎందుకు యాన్యుటీ తీసుకోవాలనే అభ్యర్థనలు వస్తున్నాయి’’అని మహంతి తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే, యాన్యుటీని వాయిదా వేసుకోవచ్చని, దీనివల్ల తర్వాత అధిక మొత్తంలో పింఛను వస్తుందని చెప్పారు. తాము తీసుకురాబోయే మార్పుతో, చందాదారులు 40 శాతం నిధితో డిఫర్డ్‌ యాన్యుటీని ఎంపిక చేసుకుని, మిగిలిన 60 శాతం ఫండ్‌ను క్రమం తప్పకుండా వెనక్కి తీసుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు.

Videos

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు