Breaking News

కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి!

Published on Mon, 07/06/2026 - 15:36

భారతదేశంలో ఈ ఏడాది మే (2026) నెలలో దేశవ్యాప్త తేయాకు ఉత్పత్తిలో గణనీయమైన క్షీణత నమోదైంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న తీవ్ర వాతావరణ పరిస్థితులు, రుతుపవనాల ముందు కురవాల్సిన వేసవి వర్షాల్లో భారీ లోటు దేశీయ టీ ఉత్పత్తిని దెబ్బతీశాయి. టీ బోర్డు విడుదల చేసిన తాజా అధికారిక గణాంకాల ప్రకారం.. మే 2026లో దేశవ్యాప్త తేయాకు ఉత్పత్తి 3.54 శాతం తగ్గి 131.60 మిలియన్ కిలోలకు పరిమితమైంది.

25 శాతం పతనమైన ఉత్పత్తి

ఈ సీజన్‌లో ఉత్తర భారత దేశం ఎంతోకొంత నిలదొక్కుకున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు మాత్రం వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయాయి. మే నెలలో దక్షిణాదిలో తేయాకు ఉత్పత్తి ఏకంగా 25 శాతం పడిపోయి 19.88 మిలియన్ కిలోలకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇక్కడ 26.57 మిలియన్ కిలోల ఉత్పత్తి రావడం గమనార్హం.

రాష్ట్రాల వారీగా దక్షిణాది పరిస్థితి

  • దక్షిణాదిలోనే అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే తమిళనాడులో ఈసారి పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది మే నెలలో 19.04 మిలియన్ కిలోలుగా ఉన్న ఉత్పత్తి ఈ ఏడాది 28 శాతం క్షీణించి 13.63 మిలియన్ కిలోలకు పడిపోయింది.

  • కేరళలో కూడా లోటు వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఉత్పత్తి 16 శాతం తగ్గి 5.86 మిలియన్ కిలోలకు (గతంలో 7.03 మిలియన్ కిలోలు) చేరింది.

  • కర్ణాటకలో సైతం ఉత్పత్తి 0.50 మిలియన్ కిలోల నుంచి 0.39 మిలియన్ కిలోలకు పడిపోయింది.

ఉత్తరాదిలో స్వల్ప ఊరట

దక్షిణాదితో పోలిస్తే ఉత్తర భారతదేశంలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గత ఏడాది మే నెలలో నమోదైన 109.86 మిలియన్ కిలోలతో పోలిస్తే, ఈసారి ఉత్తరాది ఉత్పత్తి స్వల్పంగా పెరిగి 111.72 మిలియన్ కిలోలకు చేరింది. దేశంలోనే అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే అస్సాంలో మే నెల ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 64.70 మిలియన్ కిలోలుగా (మే 2025లో 65.04 మిలియన్ కిలోలు) నమోదైంది. ఇందులో అస్సాం లోయ ప్రాంతంలో ఉత్పత్తి 61.83 మిలియన్ కిలోలకు తగ్గగా, కాచర్ ప్రాంతంలో మాత్రం స్వల్పంగా పెరిగి 2.87 మిలియన్ కిలోలకు చేరింది. పశ్చిమ బెంగాల్‌లో ఇక్కడ టీ ఉత్పత్తి 5 శాతం పెరిగి 42.69 మిలియన్ కిలోలకు (గతంలో 40.68 మిలియన్ కిలోలు) చేరింది. డూయర్స్, తెరాయ్ ప్రాంతాలు మంచి వృద్ధిని కనబరిచినప్పటికీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన డార్జిలింగ్ ప్రాంతంలో మాత్రం ఉత్పత్తి స్వల్పంగా

మే 2026 గణాంకాలు ఇలా..

ప్రాంతంమే 2025 ఉత్పత్తి (మి.కిలోల్లో)మే 2026 ఉత్పత్తి (మి.కిలోల్లో)మార్పు
భారతదేశం (మొత్తం)136.42131.60-3.54%
ఉత్తర భారతదేశం109.86111.72+1.69%
దక్షిణ భారతదేశం26.5719.88-25.17%
తమిళనాడు19.0413.63-28.41%
కేరళ7.035.86-16.64%

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)