Breaking News

రూ.72 లక్షల జాబ్ ఆఫర్.. అందుకే రిజెక్ట్ చేసాడు!

Published on Mon, 06/01/2026 - 21:33

భారీ జీతమా?, వర్క్-లైఫ్ బ్యాలెన్సా?, అనే విషయపై చాలారోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి రూ.72 లక్షల వేతనంతో కూడిన జాబ్ ఆఫర్‌ను తిరస్కరించారు. దీనికి సంబంధించిన ట్విట్టర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. ఆ ఉద్యోగ ఆఫర్‌లో కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు రావాలి, అధికారిక సెలవు విధానం లేదు, అలాగే రీలోకేషన్ సహాయం కూడా ఇవ్వలేదు. ఈ కారణాలతో అభ్యర్థి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుత జీతంపై కేవలం 25 శాతం మాత్రమే పెంపు ఉన్నట్లు కూడా వెల్లడించారు. పెరిగిన జీవన వ్యయం, వ్యక్తిగత సమయానికి అవకాశం లేకపోవడం వంటి అంశాలు కూడా అతని జాబ్ రిజెక్ట్ చేయడానికి కారణమైంది.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కొంతమంది వినియోగదారులు ఇంత పెద్ద జీతాన్ని వదిలేయడం ఆశ్చర్యం అని భావించగా, మరికొందరు మాత్రం డబ్బు కంటే మానసిక, శారీరక ఆరోగ్యం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

ఒక వినియోగదారు తాను ఏడాదికి ఒక కోటి రూపాయలకుపైగా సంపాదించినప్పటికీ, నిరంతరం పని ఒత్తిడిలో ఉండటం వల్ల జీవితం కష్టమైందని చెప్పాడు. మరో వ్యక్తి 2015లో ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి, తక్కువ జీతం ఉన్న కానీ ప్రశాంతమైన ఉద్యోగాన్ని ఎంచుకున్నానని తన అనుభవాన్ని పంచుకున్నాడు.

ఈ చర్చ ద్వారా ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతోంది. నేటి ఉద్యోగ ప్రపంచంలో కేవలం జీతం మాత్రమే కాదు, పని వాతావరణం, వ్యక్తిగత సమయం, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమవుతున్నాయి. ఎక్కువ డబ్బు ఉన్న ఉద్యోగాలు అన్ని సమయాల్లో సంతోషాన్ని ఇవ్వవు అనే ఆలోచన ఉద్యోగులలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: జాబ్ అంత ఈజీ కాదు.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన!

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)