Breaking News

వంద రోజుల్లో రూ.మూడు లక్షల కోట్ల పనులకు ఆమోదం

Published on Sat, 09/14/2024 - 09:07

ఎన్‌డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు కావొస్తున్న నేపథ్యంలో రూ.మూడు లక్షల కోట్ల ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు ఆమోదం లభించింది. ప్రాంతాల మధ్య రవాణా సదుపాయాలు పెంపొందించడం, ఆర్థిక వృద్ధిని సులభతరం చేయడం, ఉద్యోగాల కల్పనకు ఈ ప్రాజెక్ట​్‌లు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఓడరేవుల రంగంలో మహారాష్ట్రలోని వధావన్ వద్ద రూ.76,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పోర్ట్‌కు ఇటీవలే ఆమోదం లభించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోని టాప్ 10 ఓడరేవుల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన - IV కింద 62,500 కి.మీ రోడ్ల నిర్మాణంతోపాటు రోడ్లపై వంతెనల నిర్మాణం కోసం రూ.49,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు ప్రారంభించనున్నారు. రూ.50,600 కోట్ల అంచనా వ్యయంతో 936 కి.మీ విస్తరించి ఉన్న ఎనిమిది జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్లిష్టమైన భూభాగాల్లోనూ రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా లద్దాఖ్‌ను హిమాచల్ ప్రదేశ్‌తో కలుపుతూ షింఖున్ లా టన్నెల్‌ ఏర్పాటుకు ఇటీవల ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

ఇదీ చదవండి: ‘డిపాజిట్‌’ వార్‌!

రైల్వే ప్రయాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా మొదటి వంద రోజుల్లో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను ఆమోదించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.42 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. విమానాశ్రయ మౌలిక సదుపాయాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయం, బిహార్‌లోని బిహ్తాలో కొత్త సివిల్ ఎన్‌క్లేవ్‌లతో పాటు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి ప్రభుత్వ ఆమోదం లభించింది.

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)