Breaking News

మొబైల్‌ ఫోన్లపై జీఎస్‌టీ 5 శాతానికి తగ్గించాలి

Published on Mon, 08/25/2025 - 06:28

హైదరాబాద్‌: అందరికీ నిత్యావసరంగా మారిన మొబైల్‌ ఫోన్లను 5 శాతం జీఎస్‌టీ శ్లాబు కిందకు తీసుకురావాలని ఇండియా సెల్యులర్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) డిమాండ్‌ చేసింది. మొబైల్‌ ఫోన్‌ విడిభాగాలకూ 5 శాతం జీఎస్‌టీని వర్తింపజేయాలని కోరింది. ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్‌టీ రేటును తిరోగమన చర్యగా పేర్కొంది. 90 కోట్ల మంది డిజిటల్‌ సేవలను పొందేందుకు వీలు కలి్పస్తున్న మొబైల్‌ ఫోన్లను నిత్యావసరాలుగా పరిగణించాలని కోరింది. 

జీఎస్‌టీ శ్లాబులను రెండింటికి తగ్గిస్తూ, కీలక సంస్కరణలను జీఎస్‌టీ కౌన్సిల్‌కు కేంద్రం నివేదించిన నేపథ్యంలో ఐసీఈఏ ఈ విధంగా కోరడం గమనార్హం. ‘‘మొబైల్‌ ఫోన్‌ ఇకపై ఆకాంక్ష ఎంత మాత్రం కాదు. 

విద్య, ఆరోగ్యం, ఆర్థిక సేవల చేరువ, పరిపాలనకు అవసరమైన తప్పనిసరి డిజిటల్‌ సాధనం. కనుక ప్రధాని జీఎస్‌టీ సంస్కరణల అజెండా, 500 బిలియన్‌ ఎలక్ట్రానిక్స్‌ ఎకోసిస్టమ్‌ లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని 5 శాతం జీఎస్‌టీ కిందకు మార్చాలి’’అని ఐసీఈఏ చైర్మన్‌ పకంజ్‌ మొహింద్రూ కోరారు. 

2014–15 నాటికి దేశీయంగా మొబైల్‌ ఫోన్ల తయారీ విలువ రూ.18,900 కోట్లుగా ఉంటే, 2024–25 నాటికి రూ.5,45,000 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఇందులో ఎగుమతులు రూ.2,00,000 కోట్లుగా ఉన్నాయి. 2020లో మొబైల్‌ ఫోన్లపై జీఎస్‌టీని 18 శాతానికి పెంచిన తర్వాత దేశీ వినియోగం 30 కోట్ల యూనిట్ల నుంచి 22 కోట్ల యూనిట్లకు తగ్గినట్టు ఐసీఈఏ తెలిపింది.
 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)