Breaking News

ట్రిపుల్‌ ధమాకా!

Published on Thu, 12/19/2024 - 05:50

గతవారం పబ్లిక్‌ ఇష్యూ పూర్తి చేసుకున్న విశాల్‌ మెగామార్ట్, సాయి లైఫ్‌ సైన్సెస్, మొబిక్విక్‌  కంపెనీల షేర్లు బుధవారం స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయి. ఈ మూడు కంపెనీల షేర్లు భారీ ప్రీమియం ధరతో లిస్టయ్యాయి. ఈక్విటీ మార్కెట్‌ నష్టాల్లో ట్రేడవుతున్నా.., వీటికి కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో తొలిరోజే మొబిక్విక్‌ షేరు అత్యధికంగా 90%, విశాల్‌ మెగామార్ట్‌ 44%, సాయి లైఫ్‌ సైన్సెస్‌ 42 శాతం లాభాలను ఇన్వెస్టర్లకు పంచాయి.  

విశాల్‌ మెగామార్ట్‌ 
దేశవ్యాప్తంగా సూపర్‌మార్ట్‌లను నిర్వహిస్తున్న విశాల్‌ మెగామార్ట్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.78)తో పోలిస్తే 33% ప్రీమియంతో రూ.104 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 46% ఎగసి రూ.114 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 44% లాభంతో రూ.112 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.50,444 కోట్లుగా నమోదైంది.

మొబిక్విక్‌ సిస్టమ్స్‌
మొబిక్విక్‌ పేరుతో ఫిన్‌టెక్‌ సేవలు అందించే వన్‌ మొబిక్విక్‌ సిస్టమ్స్‌ షేరు బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.279)తో పోలిస్తే 59% ప్రీమియంతో రూ.442 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 90.21% ఎగసి రూ.531 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి అదే స్థాయి (రూ.530) వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4,120 కోట్లుగా నమోదైంది.  

సాయి లైఫ్‌ సైన్సెస్‌ 
హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయి లైఫ్‌ సైన్సెస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.549)తో పోలిస్తే 18% ప్రీమియంతో రూ.650 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 42% ఎగసి రూ.780 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 40% లాభంతో రూ.768 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.15,974 కోట్లుగా నమోదైంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)