Breaking News

లంచం ఆరోపణలు.. మోతీలాల్ ఓస్వాల్ స్పందన

Published on Mon, 01/20/2025 - 14:46

మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఎంఓఏఎంసీ) కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో పెట్టుబడులకు సంబంధించి సోషల్‌ మీడియా వేదికగా లంచం ఆరోపణలు ఎదుర్కొంటుంది. వీటిపై కంపెనీ స్పందించింది. ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇవి నిరాధారమైనవని, దురుద్దేశపూరితమైనవని, పరువు నష్టం కలిగించేవిగా పేర్కొంది.

ఆరోపణల నేపథ్యం

కల్యాణ్ జ్యువెలర్స్‌లో గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి ఎంఓఏఎంసీ అధికారులు లంచం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పుకార్లు కళ్యాణ్ జ్యువెల్లర్స్ షేరు గణనీయంగా పతనం కావడానికి కారణమైంది. ఇది గత రెండు వారాల్లో సుమారు 37% క్షీణించింది. ఈ తరుణంలో కంపెనీ స్పందించింది.

కంపెనీ స్పందన..

ఈ ఆరోపణలను ఖండిస్తూ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. స్వార్థ ప్రయోజనాలున్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పింది. ఇటీవల వచ్చిన లంచం ఆరోపణలు కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేసింది. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. సమగ్రతకు, అత్యున్నత ప్రమాణాలు నిర్వహించడానికి కంపెనీ నిబద్ధతతో ఉంటుందని పేర్కొంది. ఈ నిరాధార ఆరోపణల వల్ల దశాబ్దాలుగా సంస్థ, నాయకత్వం నిర్మించుకున్న మంచి పేరును చెడగొట్టడానికి స్వార్థ ప్రయోజనాలు ఉన్న వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. విశ్వసనీయ, అధికారికంగా ధ్రువీకరించిన సమాచార వనరులపైనే ఆధారపడాలని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటాదారులందరినీ కోరింది. కంపెనీ తన పెట్టుబడిదారులు, పంపిణీదారులు, వాటాదారులపరంగా అత్యున్నత స్థాయి ప్రమాణాలను అనుసరిస్తుందని తెలిపింది.

ఇదీ చదవండి: టిక్‌టాక్‌ పునరుద్ధరణ.. ట్రంప్ పుణ్యమే..!

స్టాక్ ధరలపై ప్రభావం

మోతీలాల్ ఓస్వాల్ వివరణతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో కల్యాణ్ జ్యువెల్లర్స్ షేర్లు రికవరీ అయ్యాయి. లంచం ఆరోపణలను కంపెనీ ఖండించడంతో షేరు ధర 9 శాతానికి పైగా పెరిగింది.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)