Breaking News

కొత్త బడ్జెట్టు.. వినియోగపనిషత్తు..

Published on Mon, 02/10/2025 - 14:35

‘‘ఇది ప్రజల బడ్జెట్టు. ప్రజల సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్లు, వినియోగం పెరుగుతాయి’’ అని అన్నారు ప్రధాన మంత్రి. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయి అని ఆశిస్తున్నారు మోదీగారు. ‘‘ప్రజలకు ఒరిగిందేమీ లేదు. స్కీముల సంఖ్య పెరిగిందే కానీ సంతోషపడాల్సినదేమీ లేదు. ఆర్థిక మందగమనానికి నాంది’’ అని అంటున్నారు ఒకప్పటి ఆర్థికమంత్రి చిదంబరం.

ఇక రాష్ట్రాల విషయానికొస్తే.. ప్రతి రాష్ట్రం ఎంతో కొంత అసంతృప్తిగానే ఉంది. ఆరోగ్యరంగానికి సరిపోయినంత మందు పడలేదంటున్నారు. రైల్వేను పట్టాల నుంచి తప్పించారంటున్నారు. రైతులకు అంతంతమాత్రమే అని ఒకరు .. పరిశ్రమలకు ఫర్వాలేదని మరొకరు.. ఆటలకి పెద్ద పీట.. చిన్న తరహా పరిశ్రమలకు ఊతం..కృత్రిమ మేధస్సుకు ఎక్సలెన్సు, మందుల ధరల తగ్గుముఖం .. ఆహార భద్రతకు అవకాశం ..  ఆభరణాల మీద కస్టమ్స్‌ తగ్గుదల, పత్తికి కొత్త ఊపు, జౌళి పరిశ్రమకు దన్ను, ఎయిర్‌పోర్టుల విస్తరణ, రోడ్ల మీద చిన్న చూపు, అంతరిక్ష రంగాన్ని మరింత పైకి తీసుకెళ్లే ప్రయత్నం, చిన్న తరహా పరిశ్రమలకు భారీ ఊరట, యాత్రా స్థలాల సుందరీకరణ, ఎలక్ట్రిక్‌ వాహనాల ధరల తగ్గుదల.. ఇలా ఒక్కో రంగానిది ఒక్కో పరిస్థితి.  

ఏది ఎలా ఉన్నా స్టాక్‌ ఎక్స్చేంజీల్లో షేర్లు పతనం, విజయకేతనం. ఈ పరిణామం దిక్సూచి కాకపోయినా, ఇదో వెంటాడే బూచి. ‘‘నా తలరాత మారింది. నా ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు’’ అని మురిసిపోతోంది మధ్యతరగతి మహిళ. భారీగా పెన్షన్‌ వచ్చే దంపతులు .. ఇక కంపల్సరీ సేవింగ్స్‌ మానేసి ‘‘పదవే గౌరీ, పరమాత్ముని చూడ’’ అని తీర్థయాత్రలకు విమానంలో ప్లాన్‌ చేస్తున్నారు. పింగళిగారు రాసిన పాటను పదే పదే పాడి ‘‘ప్రేమించిన పతికి ఎదురునుండగా తీర్థయాత్రకెందుకని’’ అంటూ పతిభక్తి చాటుకున్న భార్య సత్యవతి .. పదండి పదండి ఎప్పుడూ ఈ పాడు కొంపేనా అంటూ ట్రావెలింగ్‌ ఏజంటు దగ్గరకి పరుగెత్తింది, మొగుడి క్రెడిట్‌ కార్డు పట్టుకుని.

‘వెకేషన్‌’కి పెద్ద ప్లాన్‌ చేస్తోంది లావణ్య. అక్కతో పాటు నేనూ, మా ఆయనా వస్తాం అంటోంది చెల్లెలు త్రిష. ‘మ్యుచువల్‌ ఫండ్స్‌’లో ఇన్వెస్ట్‌ చేయడానికి రెడీ అవుతున్నాడు రవి. ‘నాకు జీతం పెంచకపోయినా ఫర్వాలేదు’ అంటోంది ఉద్యోగిని ఊర్మిళ.. వాళ్లబాసుతో. ఇంట్లో పాత ఫర్నిచరు, టీవీలు తీసేసి కొత్తవి కొనుక్కుందాం అని అంటోంది మరో మహిళ లలిత. ఇల్లు కొత్తది కాకపోయినా మంచిగా ఇంటీరియర్స్‌ చేయిద్దాం అంటోంది హరిత. ‘‘సేవింగ్స్‌తో మంచిగా అప్‌స్కేలింగ్‌ వైపు వెళ్తాను’’ అని అంటున్నాడు అక్షిత్‌.

లేటెస్టు మ్యూజిక్‌ పరికరాలు కొని సంగీతం సాధన చేస్తానంటోంది మరో వనిత అభిజ్ఞ. షేరు మార్కెట్లో ఎంటర్‌ అయ్యి వెల్త్‌ క్రియేట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు వారెన్‌ బఫెట్‌ బుక్‌ చతివి రత్నాకర్‌. ‘‘పొరుగింటి మీనాక్షమ్మని చూశారా’’ అనే ప్రశ్న మానేసి తనకి కావాల్సిన బంగారం ఆభరణాలను ప్లాన్‌ చేస్తోంది నాగమణి.  

వీళ్ళందరి ఆలోచనలూ నిజమయ్యేనా? అంటే నిజమే అనిపిస్తోంది. తన ప్రతిపాదనలతో సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయల నష్టమని చెప్తున్నారు సీతమ్మ తల్లి. రెండు కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లకు లబ్ధి చేకూరుతుందని ఫైనాన్స్‌ సెక్రటరీ పాండేగారి ఉవాచ. జనాల చేతిలో మిగులు. అలా మిగిలిన మొత్తం వెచ్చించడానికి ఇక హద్దులుండవు. ఇప్పటికి ప్రైవేటు వారి చేతిలో వినియోగం నిమిత్తం ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేది రెండు వందల లక్షల కోట్లు. దానికి అదనంగా ఒక లక్ష కోట్లు అంటే సామాన్యం కాదు. పెద్ద సంఖ్యే.

క్రమేపీ, పాత విధానం పన్నుల సేకరణ ఉండదు. కొత్త విధానానికి మొగ్గు చూపిస్తున్నారు. ద్రవ్యోల్బణం కొనసాగుతున్నా ఖర్చుల స్థాయి తగ్గలేదు. కోడి పందాల్లో వేల కోట్లు. కుంభమేళా సందర్భంగా కొన్ని వేల కోట్లు. ఆకలి చావులుండవచ్చు.. కానీ కోడి పులావ్‌ అమ్ముడుపోతుంది. అందరి ఖర్చులు పెరుగుతాయి. లిక్విడిటీ పెరుగుతుంది. ఈ యాగంలో ‘‘వినియోగమే’’ యోగప్రదమైనది.

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌ పంపించగలరు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)