Breaking News

యాపిల్‌ యూజర్లకు కేంద్రం హైరిస్క్‌ అలర్ట్‌!

Published on Tue, 11/12/2024 - 18:54

యాపిల్‌ ఉత్పత్తులు వాడుతున్న వారికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హైరిస్క్‌ అలర్ట్‌లు పంపుతోంది. అవుట్‌డేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ వాడుతున్న ఐఫోన్‌, మ్యాక్‌బుక్‌, యాపిల్‌ వాచ్‌లు వంటి ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. దాంతో ఆయా వినియోగదారులకు హైరిస్క్‌ అలర్టులు పంపుతున్నట్లు స్పష్టం చేసింది.

పాత సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తున్న యాపిల్ డివైజ్‌ల్లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అడ్వైజరీని విడుదల చేసింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు, సైబర్‌ ఫ్రాడ్‌కు పాల్పడేవారు వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన డేటాను యాక్సెస్‌ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. డేటా మానిప్యులేషన్‌కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. తాజా సెక్యూరిటీ అప్‌డేట్‌లో ఆపిల్ ఈ లోపాలను పరిష్కరించింది. సైబర్‌ ప్రమాదాలను తగ్గించడానికి, భద్రతా ఉల్లంఘనల నుంచి రక్షించుకోవడానికి వినియోగదారులు తమ డివైజ్‌ల్లో తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని CERT-In సిఫార్సు చేసింది.

ఇదీ చదవండి: తెరకెక్కనున్న ఆర్‌బీఐ ప్రస్థానం!

ఐఓఎస్‌ 18.1 లేదా 17.7.1 కంటే ముందున్న సాఫ్ట్‌వేర్‌ వెర్షన్‌లను వినియోగిస్తున్న యాపిల్‌ కస్టమర్లు వెంటనే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని సెర్ట్‌-ఇన్‌ సూచించింది. వాచ్‌ఓఎస్‌, టీవీఓఎస్‌, విజన్‌ ఓఎస్‌, సఫారి బ్రౌజర్‌ వంటి పాత వెర్షన్‌లపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. కాబట్టి ఆయా వినియోగదారులు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపింది.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)