Breaking News

ప్రపంచంలోనే అత్యుత్తమ హెలికాప్టర్ల నిర్వహణకు రూ.8000 కోట్లు

Published on Sat, 11/29/2025 - 09:11

భారత నావికాదళం శక్తిని బలోపేతం చేసే దిశగా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. ఇండియన్‌ నేవీకి చెందిన ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ల నిర్వహణ కోసం అమెరికాతో రూ.8,000 కోట్ల భారీ ఒప్పందంపై సంతకం చేసింది. ఫారిన్ మిలిటరీ సేల్స్ (FMS) ప్రోగ్రామ్ కింద ఖరారు చేసిన ఈ ఒప్పందం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతను పెంపొందించడానికి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

డీల్ ముఖ్యాంశాలు

ఈ ఒప్పందం ఐదేళ్లపాటు సమగ్ర సస్టైన్‌మెంట్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. 2021లో భారత నావికాదళంలో చేరిన 24 ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్ల పూర్తిస్థాయి కార్యాచరణ, నిర్వహణను ఈ ఒప్పందం నిర్ధారిస్తుంది. ఈ కాంట్రాక్ట్ విలువ రూ.8,000 కోట్లు. ఇందులో భాగంగా భారతదేశంలో చాపర్ల మరమ్మతు సౌకర్యాల నిర్వహణ, విడిభాగాలు, అత్యాధునిక లాజిస్టిక్స్ మద్దతు, సిబ్బంది శిక్షణ వంటివి పర్యవేక్షిస్తారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ మల్టీ రోల్ హెలికాప్టర్లు

లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ ప్రపంచంలోని అత్యంత అధునాతన మల్టీ రోల్ మారిటైమ్ హెలికాప్టర్లలో ఒకటిగా ఉన్నాయి. యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌(ASW), యాంటీ సర్ఫేస్‌ వార్‌ఫేర్‌(ASuW), సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ (SAR), సర్వేలెన్స్‌కు ఇవి ఎంతో తోడ్పడుతాయి. అత్యాధునిక సెన్సార్లు, ఏవియానిక్స్, శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలు కలిగి సులభంగా యుద్ధనౌకల నుంచి పనిచేసేందుకు వీలుగా వీటిని రూపొందించారు.

ఇదీ చదవండి: వెండికి హాల్‌మార్కింగ్‌.. వజ్రాభరణాలపై ఫ్రేమ్‌వర్క్‌

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)