Breaking News

కొత్తగా బొగ్గు గనుల కేటాయింపు

Published on Sat, 09/07/2024 - 10:28

కేంద్ర ప్రభుత్వం మూడు కంపెనీలకు బొగ్గు గనులకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టాన్‌జెడ్కోలకు గనులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల 40,560 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది.

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌కు ఒడిశాలోని ముచ్చకట, గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌, టాన్‌జెడ్కో కంపెనీలకు వరుగా ఒడిశాలోని అంగుల్‌ జిల్లా పరిధిలోని కుదనాలి లూబ్రి, సఖిగోపాల్-బి కకుర్హి బొగ్గు గనులను కేంద్రం కేటాయించింది. ఈ మూడు బొగ్గు గనుల సంచిత పీక్ రేటెడ్ కెపాసిటీ (పీఆర్‌సీ) 30 ఎంటీపీఏ(మిలియన్‌ టన్స్‌ పర్‌ యానమ్‌)గా నిర్ణయించారు. అయితే ఈ గనుల మొత్తం కెపాసిటీ 2,194.10 మిలియన్‌ టన్నులుగా అంచనా వేశారు. వీటి ద్వారా వార్షిక ఆదాయం రూ.2,991.20 కోట్లు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కంపెనీలకు కేటాయించిన పీఆర్‌సీ ఆధారంగా రూ.4,500 కోట్ల పెట్టుబడి సమకూరే అవకాశం ఉంటుందని పేర్కొంది. అందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,560 మందికి ఉపాధి లభిస్తుందని వివరించింది.

ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..

ఇటీవల జారీ అయిన బొగ్గు గనుల కేటాయింపు ఉత్తర్వులతో కలిపి మొత్తం 95 గనుల నుంచి బొగ్గు వెలికి తీస్తున్నారు. వాటి మొత్తం పీఆర్‌సీ సామర్థ్యం 202.50 ఎంటీపీఏగా ఉంది. దీనివల్ల రూ.29,516.84 కోట్ల వార్షిక ఆదాయం సమకూరుతుంది. ఈ గనుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,73,773 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

#

Tags : 1

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)