Breaking News

మైక్రొసాఫ్ట్ కీలక నిర్ణయం: త్వరలో ఆ యాప్ షట్‌డౌన్!

Published on Sun, 03/02/2025 - 11:29

ప్రపంచంలోనే మొట్టమొదటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ 'స్కైప్‌' (Skype)ను శాశ్వతంగా మూసివేయాలని, టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' యోచిస్తోంది. మే నుంచి స్కైప్ అందుబాటులో ఉండదని.. కంపెనీ వెల్లడించింది.

2003లో ప్రారంభమైన స్కైప్‌ను.. మైక్రోసాఫ్ట్ 2011లో 8.5 బిలియన్ డాలర్లకు (ప్రస్తుత కరెన్సీ ప్రకారం రూ. 74వేలకోట్లు) కొనుగోలు చేసింది. ఆ తరువాత ఇందులో అనేక అప్డేట్స్ తీసుకొచ్చింది. విండోస్ లైవ్ మెసెంజర్ తొలగింపు తరువాత.. 2015లో మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను విండోస్ 10 లో అనుసంధానించడానికి ప్రయత్నించింది. ఇది మొత్తం తొమ్మిది నెలలు కొనసాగింది. అయితే ఇప్పుడు 22 ఏళ్ల స్కైప్ ప్రయాణానికి మంగళం పాడనుంది.

మైక్రోసాఫ్ట్.. స్కైప్‌ను అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా పాటుపడింది. ఇందులో భాగంగానే యాపిల్ కంపెనీకి చెందిన 'ఐమెసేజ్'తో పోటీ పడటానికి సిద్ధమైంది. అయినా ఎలాంటి ఉపయోగం కనిపించలేదు. 2017లో మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను ప్రారంభించింది. ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా స్కైప్ అభివృద్ధి చెందలేదు. దీంతో చేసేదేమీ లేక.. కంపెనీ పూర్తిగా స్కైప్‌ను నిలిపివేయడానికి ఫిక్స్ అయింది. సంస్థ ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా యూజర్లకు వెల్లడించనుంది.

#

Tags : 1

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు