Breaking News

మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఈ రంగాలపైనే ప్రభావం!

Published on Fri, 07/19/2024 - 17:40

మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య పలు రంగాల్లో తీవ్ర అంతరాయాలను కలిగించాయి. టికెట్ బుకింగ్స్ నుంచి చెక్ ఇన్ వరకు అన్నింటికీ అవాంతరాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.

భారతదేశంలో మాత్రమే కాకుండా.. అమెరికా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అయింది. క్రౌడ్‌స్ట్రైక్‌ సమస్యను తామే పరిష్కరిస్తామంటూ వెల్లడించింది. ఈ తరుణంలో అమెరికా ఎమర్జెన్సీ కాలర్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్‌ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది.

బ్రిటన్‌లో విమాన సర్వీసులు మాత్రమే కాకుండా.. రైల్వే, హాస్పిటల్ సర్వీసుల్లోనూ అంతరాయాలు ఏర్పడ్డాయి. అక్కడి స్కైన్యూస్ ప్రసారాలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)