Breaking News

సంక్లిష్ట చక్రంలో సూక్ష్మ రుణ రంగం

Published on Tue, 06/10/2025 - 06:38

ముంబై: అధిక రుణ భారం, గరిష్ట వడ్డీ రేట్లు, కఠిన వసూళ్ల ప్రక్రియలతో కూడిన సంక్లిష్ట సైకిల్‌తో సూక్ష్మ రుణ రంగం సతమతమవుతోందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం రాజేశ్వర్‌రావు అన్నారు. ‘అందరికీ ఆర్థిక సేవలు’ అన్న అంశంపై హెచ్‌ఎస్‌బీసీ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. సూక్ష్మ రుణాలపై అధిక వడ్డీ రేట్లను ప్రధానంగా ప్రస్తావించారు. జనాభాలో మినహాయింపు వర్గాలకు సంఘటిత ఆర్థిక సేవలను అందించడంలో సూక్ష్మ రుణ రంగం విశ్వసనీయ వేదికగా ఉన్నట్టు పేర్కొన్నారు. 

అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో సూక్ష్మ రుణ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయంటూ.. ఈ విషయంలో కొన్ని సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఇటవలి త్రైమాసికాల్లో సూక్ష్మ రుణాలపై వడ్డీ రేట్లు కొంత మోస్తరు స్థాయికి రావడాన్ని గమనించినట్టు చెప్పారు. అయినప్పటికీ వడ్డీ రేట్లు, మార్జిన్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నట్టు తెలిపారు. కొన్ని సంస్థలకు తక్కువ వ్యయాలకే నిధులు లభిస్తున్నప్పటికీ మిగిలిన పరిశ్రమతో పోల్చతే అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అధిక రాబడులను ఇచ్చే సంప్రదాయ వ్యాపారానికి వెలుపలి అవకాశాలపై రుణదాతలు దృష్టి సారించాలని సూచించారు.  

ప్రక్రియలను మెరుగుపరుచుకోవాలి.. 
‘‘సూక్ష్మ రుణ రంగంలో తరచుగా సమస్యలు ఏర్పడడం ఇటీవలి కాలంలో పెరిగింది. ఒక్కో రుణ గ్రహీత బకాయిల భారం పెరిగింది. దీంతో కొన్ని సందర్భాల్లో కఠిన వసూళ్ల ప్రక్రియలు విషాద పరిణామాలకు దారితీస్తున్నాయి’’అని రాజేశ్వరరావు చెప్పారు. ఇలాంటి వాటిని పరిష్కరించుకోవడం భాగస్వాములు అందరి ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా అవసరమని పేర్కొన్నారు. రుణ గ్రహీతలు అధికంగా రుణం తీసుకోవడాన్ని నిరోధించేందుకు వీలుగా నియంత్రిత సంస్థలు తమ క్రెడిట్‌ ఆమోద ప్రక్రియలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. అలాగే, కఠిన రుణ వసూళ్ల ప్రక్రియలను విడిచి పెట్టాలన్నారు. స్థిరమైన, బాధ్యతాయుత విధానంలో సేవలు అందించాలని సూచించారు. ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టించి విక్రయించడాన్ని కూడా రాజేశ్వరరావు ప్రస్తావించారు. ఈ విషయంలో నిబంధనలు తీసుకురావాలా? లేదా అన్నదాన్ని ఆర్‌బీఐ పరిశీలిస్తున్నట్టు చెప్పారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)